ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నబలమైన నాయకుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరు.
కడప ఎంపీగా గెలుపొంది, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ ఈ పొలిటికల్ జర్నీలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.
అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడని విపరీతంగా ప్రచారం చేసినా.. కేసులు మోపి జైల్లో పెట్టినా.. అనుకున్న లక్ష్యం కోసం మొండిగా పోరాడారు జగన్ .
2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్.. కడప ఎంపీగా గెలుపొందారు. కానీ అదే కొద్ది నెలల వ్యవధిలోనే.. సెప్టెంబర్ 2న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
వైఎస్ మరణం తర్వాత.. జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ.. ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసిన లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు.
కానీ.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం జగన్‌ను సీఎం చేయడానికి అంగీకరించలేదు.
రాజశేఖర రెడ్డి మరణం తరువాత.. జగన్ ‘ఓదార్పు యాత్ర’కు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ దీనికి అనుమతి ఇవ్వకపోవడంతో జగన్ కాంగ్రెస్ నుండి బయటకి వచ్చేశారు
2010లో కాంగ్రెస్‌కు, పదవులకు రాజీనామా చేసిన జగన్, విజయమ్మ.. తన తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ పార్టీని వీడాక జగన్‌పై రకరకాలుగా ఒత్తిడి పెరిగింది. కానీ స్వతహాగా మొండి వాడయిన జగన్ వెనక్కి తగ్గలేదు. దీంతో జగన్ 16 నెలల జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో ఫ్యామిలీపై దుష్ప్రచారం. జగన్‌పై అవినీతిపరుడనే ముద్ర. వైఎస్ కొడుకనే అభిమానం ఉన్నప్పటికీ.. 2014 ఎన్నికల్లో ‘అవినీతి మరక’ జగన్‌కు ప్రతికూలమైంది.
ఇక 2019 ఎన్నికల్లోనూ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి. ఈ తరుణంలో జగన్ జనాన్ని నమ్ముకున్నారు. తన తండ్రి చూపిన బాటలో పయనించి.. ఎన్నికలు సుదూరంగా ఉండగానే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
341 రోజుల పాటు 113 అసెంబ్లీ నియోజక వర్గాల మీదుగా.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3648 కి.మీ. పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో 2 కోట్ల మందికిపైగా ప్రజలను ప్రత్యక్షంగా కలిశారాయన.
36 ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. ఈ పదేళ్ల రాజకీయ జీవితంలో మరే ఇతర నాయకుడూ ఎదుర్కోనన్ని ఇబ్బందులు పడ్డారు.
తండ్రి అకాల మరణం, అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడం, తొలి ఎన్నికల్లో ఓటమి.. ఇలా ప్రతికూల పరిస్థితుల్లోనూ మొండి పట్టుదలతో లక్ష్య దిశగానే సాగాడు.