సమాజంలో అనేక రకాల మనసత్వాలు కలిగిన వారు ఉంటారు.
ముఖ్యంగా కొందరి మనసత్వం, ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి.
అలానే తినే ఆహారం విషయంలోనూ కొందరికి విచిత్రమైన మనసత్వం ఉంటుంది.
తాజాగా ఓ యువకుడిని వింత మనసత్వం గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆ యువకుడి అన్నం అంటే ఒంట్లో వణుకు పుడుతుంది.
అన్నం తిన్నకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 ఏళ్లుగా జీవిస్తున్నాడు.
ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాలోని పత్రపుట్ గ్రామంలో పార్వతి, మను సగరియా అనే దంపతులు ఉంటున్నారు.
ఈ దంపతులకు కిశోర్ సగరియా అనే 21 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
చిన్నతనం నుంచి కుమారుడు కిశోర్ లో విచిత్రమైన మనస్తత్వాన్ని పార్వతి సగరియా దంపతులు గుర్తించారు.
ఈ 21 ఏళ్లలో కిశోర్ సగరియా ఒక్కసారి కూడా అన్నం తీసుకోలేదు.
కిశోర్ కి చిన్నతనం నుంచే అన్నం చూస్తే వణుకు వస్తుందంట.
కేవలం అటుకులు, మరమరాలు, పరోటాలు మాత్రమే తింటూ జీవిస్తున్నాడు.
కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత నచ్చజెప్పినా అన్నం ముద్ద కూడా ముట్టుకోనే లేదంట.
అటుకులు, మరమరాలు తినడం వలన తనకు ఎలాంటి ఇబ్బంది లేదని కిశోర్ పేర్కొన్నాడు.
అన్నం తీసుకోకుండానే ఆ యువకుడికి అవసరమైన శక్తి అందుతుందని వైద్యులు తెలిపారు.
ఈ అలవాటు కారణంగా భవిష్యత్ లో సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు.