వర్షకాలం అందరికీ ఉండే సమస్య బట్టలు ఆరకపోవడం. చాలామంది బట్టలు వాసనొస్తున్నా సరే సెంట్ కొట్టి మేనేజ్ చేస్తారు.
ఇక మనలో చాలామంది సాధారణ దుస్తులకు ఇచ్చే ప్రాధాన్యం, లో దుస్తులకు ఇవ్వరు. దీంతో తడిచినా సరే వాటినే ధరిస్తుంటారు.
అయితే లో దుస్తుల పరిశుభ్రత విషయంలో జాగ్రత్త పడకపోతే..పలు రకాల సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇన్నర్ వేర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. మగాళ్లు, ఆడవాళ్ల ప్రైవేట్ పార్ట్స్ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని గుర్తించాలి.
ముఖ్యంగా మహిళలు ఇలా చేయడం వల్ల.. ఫంగస్, అలర్జీ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఎరుపు దద్దుర్లు కూడా ఏర్పడొచ్చు.
ఇలాంటి సమస్యల కారణంగా మూత్రవిసర్జన చేసే సమయంలో నొప్పి, దురద లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
తడిచిన 'లో దుస్తులు' ఎక్కువసేపు ఉపయోగిస్తే.. పీహెచ్ వాల్యూస్ లో మార్పులు వచ్చి ప్రమాదం వాటిల్లే ఛాన్సుంది.
వర్కౌట్స్ చేసేవాళ్లు.. జాగింగ్, వాకింగ్ లాంటివి చేసిన వెంటనే.. లో దుస్తులు మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అలానే వదిలేస్తే.. అంటువ్యాధులు వచ్చే అవకాశముందట.
చెమట సమస్యతో బాధపడేవారు.. రోజులో ఒకటి కంటే ఎక్కువసార్లు లో దుస్తులు మార్చుకుంటే మంచిది.
తడిచిన లో దుస్తులే కాదు.. సైజుకు సరిపోయే ఇన్నర్ వేర్ ని వేసుకోవాలి. మరీ టైట్ గా ఉన్నా సరే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
నార్మల్ దుస్తుల కంటే లో దుస్తులు నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుండటంతో పాటు బాడీ షేప్ నీట్ గా ప్రొజెక్ట్ అవుతుంది.