మనం చాలా రకాల ఫుడ్స్ తింటుంటాం. కొన్నింటిని నములుతాం, మరికొన్నింటిని అలానే మింగేస్తుంటాం.

ఇలా ఆహారాన్ని నమలకుండా తినడం వల్ల అది మీ జీర్ణాశయంపై ప్రభావం చూపిస్తుంది. 

అందుకే మీరుతినే ఫుడ్ ని 36 సార్లు నమిలి తినాలట.

అంటే నోట్లో ముద్దు పెట్టుకున్నప్రతిసారి 36సార్లు నమిలి తినాలి అంటే నోట్లోనే ఫుడ్ నీరులాగా మారిన తర్వాతే మింగాలన్నమాట.

అప్పుడే ఫుడ్ సగంవరకు నోట్లోనే జీర్ణమవుతుంది. మిగతాది జీర్ణాశయంపై భారం పడకుండా జీర్ణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు

ఒకవేళ మనం సరిగా నమలకుండా మింగేస్తే.. ఆ భారం మొత్తం మన జీర్ణాశయం మీద పడుతుంది. అప్పుడు ఆహారం సరిగ్గా అరగదు.

ఫుడ్ ని నమిలి తినకపోవడం వల్ల పోషకాలు సరిగా అందవు. 

అరగకుండా మింగేస్తే ఒక్కోసారి అది విషంగా మారే అవకాశం కూడా ఉంది.

ఇలా కనుక ఎక్కువగా జరిగితే మన జీర్ణశయం మెల్లగా దెబ్బతినే అవకాశం ఉంది.అందుకే బాగా నమిలి తినడానికి ప్రయత్నించండి.

ఆహారాన్ని తినేటప్పుడు ప్రశాంతంగా తినాలి. మొబైల్స్, టీవీ చూడడం, మాట్లాడడం, ఆలోచించడం, కంగారుగా తినడం అస్సలు చేయకూడదు.

మనం తింటున్న ఆహారాన్ని ఆస్వాదించుకుంటూ, బాగా నమిలి నమిలి తీసుకోవాలి. అప్పుడే ఆహారం మన శరీరానికి పడుతుంది.

మన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని పూర్తిగా నమిలి నీళ్లలాగా నింగినప్పుడే జీర్ణాశయంపై ఎటువంటి భారం పడదు.

అప్పుడు అజీర్తి, ఎసిడిటీ , గ్యాస్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఏది ఏమైనా వైద్యులు విషయం లేనిదే ఏది మనకు చెప్పరు కదా.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.

ఫుడ్ నమలకుండా తింటున్నారా? మీ పని అయిపోయినట్లే!