ఈ ఏడాది ఫిబ్రవరి 18న శనిత్రయోదశి నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది.
శివరాత్రి నాడు శని ప్రదోష, సర్వార్థ సిద్ధి వంటి మహా యోగాలు చేస్తారు.
ఇక శంకరుడు భక్త సులభుడు. పిలిస్తే పలికే దైవం. అలాంటి ఈశ్వరుడికి ఎంతో ప్రీతి పాత్రమైన శివరాత్రి రోజున కొన్ని పనులు చేస్తే అప్పుల బాధలు తొలగుతాయి అంటున్నారు పండితులు.
శివ పురాణంలో కూడా మానవుల సంక్షేమం కోసం అనేక పరిహారాలు పొందుపరిచారని చెబుతారు.
అలానే శివ పురాణంలో రుణ విముక్తి కోసం కొన్ని పరిహారాలు సూచించారు.
అవి ఏంటంటే.. మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి నేతిలో ముంచిన నువ్వులతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది అంటున్నారు పండితులు.
ఇలా నేతిలో ముంచిన నువ్వులతో అభిషేకం చేస్తూ ఓం నమఃశ్శివాయ మంత్రాన్ని పఠించాలి.
శివరాత్రి రోజున శివ లింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు పండితులు.
ఇక శివరాత్రి రోజున సూర్యాస్తమయం తర్వాత, రాత్రికి ముందు వికసించే చెట్టు కింద ఆవనూనెతో చేసిన నాలుగు దీపాలను వెలిగించి.. ఓం నమఃశ్శివాయ మంత్రాన్ని జపిస్తే రుణ విముక్తులవుతారని శివ పురాణంలో వర్ణించారు.
అలానే శివరాత్రి నాడు శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వవృక్షం కింద పేదలకు, బ్రాహ్మణులకు అన్నం పెడితే ధన లాభం కలుగుతుంది అంటున్నారు.
ఇక శివరాత్రి రోజున ఓం రిన్ ముక్తేశ్వర్ మహాదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ.. నువ్వులను, పప్పులను సమర్పిస్తే
రుణ బాధల నుంచి విముక్తి లభించడమే కాక ఆర్థిక వృద్ధి కలుగుతుంది అంటున్నారు.