సాధారణంగా టూత్ పేస్టును మనం పళ్లను శుభ్రం చేసుకోవటానికి మాత్రమే వాడుతుంటాం.
మరికొంతమంది ముఖంపై వచ్చిన మొటిమల్ని పారద్రోలటానికి కూడా పేస్ట్‌ను ఉపయోగిస్తూ ఉంటారు.
పేస్ట్‌ను ఈ రెండిటి కోసమే కాదు.. కొన్ని వస్తువుల్ని శుభ్రం చేయటానికి కూడా ఉపయోగించవచ్చు. వాటిపై ఉన్న మరకల్ని పొగొట్టవచ్చు.
టూత్ పేస్ట్ ను ఉపయోగించి ఫోన్ కవర్‌ను క్లీన్ చేయోచ్చు. దానికోసం టూత్ పేస్ట్ ను కవర్ మీద 2 నుంచి 3 నిమిషాలు ఉంచాలి.
ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కవర్‌ను శుభ్రంగా కడగండి. దీంతో ఫోన్ కవర్ కొత్త దానిలా మెరుస్తుంది.
దుస్తులకు అంటుకున్న లిప్ స్టిక్ మరకలు వదలటం చాలా కష్టం. అయితే ఈ మరకలను పోగొట్టడానికి టూత్ పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది.
దీనికోసం లిప్ స్టిక్ మరకలు అంటిన ప్రదేశంలో టూత్ పేస్ట్‌ను రాయాలి. టూత్‌పేస్ట్ ఎండిన తర్వాత బ్రష్‌తో పేస్ట్ రాసిన భాగాన్ని కడగాలి. అంతే.. మరక మాయం అవుతుంది.
టీ మరకల్ని శుభ్రం చేయటంలోనూ టూత్ పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మొండి టీ మరకల్ని కూడా ఇట్టే పోగొట్టేస్తుంది.
టీ మరకలు అంటిన చోట టూత్ పేస్ట్ రాసి కొద్ది సేపు ఎండనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేస్తే మరకలు ఇట్టే మాయమైపోతాయి.