స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘యశోద’

యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఈ మూవీని దర్శకద్వయం హరి – హరీష్ రూపొందించారు

సరోగసి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా.. తాజాగా తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది

మరి యశోద మూవీ ఎలా ఉంది? సమంత ఎంతవరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం!

కథ: ఈ సినిమా కథ సరోగసి కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. సంతానం లేని ధనికులకు సరోగసి ద్వారా పిల్లల్ని అందిస్తుంటుంది ఓ కంపెనీ.

పేదింటి అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి సరోగసి తల్లులుగా మార్చుతుంటుంది. అలా డబ్బు కోసం బలైన పేదింటి యువతులలో యశోద(సమంత) ఒకరు.

కట్ చేస్తే.. ఆ కంపెనీలో సరోగసి పేరుతో ఎన్నో అక్రమాలు చేస్తున్నారని యశోద తెలుసుకుంటుంది. మరి సరోగసి వెనుక జరుగుతున్న అక్రమాలు ఏంటి?

సరోగసి తల్లిగా యశోద ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసింది? ఏం సందేశం ఇచ్చింది? అనేది తెరపై చూడాలి

సామాజిక అంశాలు, మెడికల్ మాఫియా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ.. యశోదలో ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్ ని తెరపైకి తీసుకొచ్చారు దర్శకులు

ట్రైలర్ లో సరోగసి పాయింట్ ఉందని చెప్పారు. కానీ.. లోపల సినిమా ప్రారంభం నుండి ఎండ్ కార్డు వరకు స్క్రీన్ ప్లేతో ఆడుకున్నారు

డబ్బు అవసరమై సరోగసి మార్గాన్ని ఎంచుకున్న పేదింటి యువతిగా యశోద(సమంత) క్యారెక్టర్ ని ఇంట్రెస్టింగ్ గా ఇంట్రడ్యూస్ చేశారు

ఓవైపు యశోద.. మరోవైపు ఓ మోడల్ యాక్సిడెంట్ కేసు ఇన్వెస్టిగేషన్.. ఫ్యామిలీ ఎమోషన్స్.. అదిరిపోయే ఇంటర్వెల్ ట్విస్టుతో ఫస్టాఫ్ ముగిసింది

సెకండాఫ్ లో ఆ కంపెనీలో అసలు ఏం జరుగుతోంది అనే విషయాన్నీ రేకెత్తిస్తూనే.. యశోద నెక్స్ట్ ఏం చేయబోతుంది? అనే పాయింట్ ని బాగా రైస్ చేశారు

గర్భంతో ఉన్నప్పటికీ యశోద పోరాటం.. యాక్షన్ బ్లాక్స్, పేద అమ్మాయిలు ఎలా మోసపోతున్నారనే విషయాలు బాగా చూపించారు

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త రెగ్యులర్ గా అనిపిస్తుంది. కానీ.. ప్రేక్షకులను సంతృప్తి పరుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ లో మిస్టరీ ఎలిమెంట్స్ కూడా జోడించడం విశేషం

యశోదగా సమంత తన విశ్వరూపాన్ని చూపించింది. వరలక్ష్మి, ఉన్ని ముకుందన్ రోల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సపోర్టింగ్ రోల్స్ కూడా సినిమాలో కీలకపాత్ర పోషించాయి

టెక్నికల్ గా ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి

ప్లస్ లు:మంత & సపోర్టింగ్ క్యారెక్టర్స్ స్టోరీ, స్క్రీన్ ప్లే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీక్వెన్సెస్ ట్విస్టులు

మైనస్ లు: ప్రీ క్లైమాక్స్

చివరిమాట: సరోగసి ప్యాకెడ్ యాక్షన్ థ్రిల్లర్!

రేటింగ్:  3/5