ఆస్కార్ అవార్డు పేరు చెప్పగానే ప్రతి యాక్టర్, డైరెక్టర్ ఒళ్లు పులకరించిపోతుంది.

ప్రపంచం మెచ్చే ఈ అవార్డుని లైఫ్ లో కనీసం ఒక్కసారి అందుకోవాలని కలలు కంటుంటారు.

ఇన్నేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఏ మూవీ కూడా ఈ అవార్డు గెలుచుకోలేకపోయింది.

ఏఆర్ రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నప్పటికీ అది భారతీయ సినిమాకి కాదు.

తాజాగా విదేశీ సినిమా కేటగిరీలో పోటీలో నిలిచిన 'ఆర్ఆర్ఆర్'.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు సొంతం చేసుకుంది.

దీంతో సామాన్యుల నుంచి స్టేట్ సీఎంల వరకు ప్రతి ఒక్కరూ 'ఆర్ఆర్ఆర్' టీమ్ ని తెగ మెచ్చుకుంటున్నారు.

కానీ 'ఆర్ఆర్ఆర్' మూవీ.. భారతదేశం నుంచి ఆస్కార్ కి వెళ్లిన అధికారిక ఎంట్రీ అయితే కాదు. సొంతంగా బరిలో దిగింది.

తొలుత గుజరాతీ మూవీ 'ఛెల్లో షో' సినిమా.. భారత ఫిల్మ్ ఫెడరేషన్ ఆస్కార్ కు పంపింది. కానీ ఇది కనీసం నామినేట్ కూడా లేదు.

'ఆర్ఆర్ఆర్'తో మూవీలో పాటకు, 'ద ఎలిఫెంట్ విస్పర్స్' అనే డాక్యుమెంటరీకి.. ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

మన దేశానికి కూడా ఆస్కార్ వచ్చిందనే ఆనందంలో అందరూ ఉండగా.. ఏఆర్ రెహమాన్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అర్హత లేని చాలా సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నారని.. దీని వల్ల చాలా సినిమాలకు అన్యాయం జరుగుతోందని వాపోయాడు.

'కొన్నిసార్లు మన సినిమాలు ఆస్కార్ కు వెళ్తాయని అనుకుంటాను. కావీ అవి వెళ్లవు. దీంతో ఏం చేయాలని స్థితిలో ఉంటున్నా' అని రెహమాన్ చెప్పుకొచ్చాడు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.. ఈ వ్యాఖ్యలు చేశాడు.

దీంతో ఇవి కాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారానికి కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ దీని గురించి టాక్ నడుస్తోంది.

మరి రెహమాన్ కామెంట్స్ పై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.