ఎక్కడైనా ప్రోగ్రామ్ లో ఎవరైన స్టేజ్ మీద డ్యాన్స్ చేసినా, లేక మంచి సందేశం ఇచ్చినా వెంటనే వారిని ప్రోత్సహించడానికి మనం చేసే మొట్ట మొదటి పని చప్పట్లు కొట్టడం.

ఇలా పార్ఫామెన్స్ చేసిన వారికి చప్పట్లతో ఎంకరేజ్ చేయడం ద్వారా ఆ వ్యక్తి చాలా సంతోషపడతారు. 

కానీ ఇక్కడ మనం కొట్టే చప్పట్లు అతనికి సంతోషాన్ని ఇస్తే.. మనకు ఉత్తేజాన్ని ఇస్తాయట. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమేనని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.  

అసలు చప్పట్లు కొట్టడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.  

చప్పట్లు కొట్టడం ద్వారా పార్ఫామెన్స్ చేసిన వారిని సంతోష పెట్టడంతో పాటు మనకు ఆరోగ్యంగా కూడా ఎన్నో ప్రయోజనాలు దాగి ఉంటాయని తెలుస్తుంది.

రోజు చప్పట్లు కొట్టడం ద్వారా మానసికంగా ఉత్తేజం పొందడంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలను నుంచి బయటపడొచ్చట.

అయితే మీ రోజు వారి వ్యాయామంలో భాగంగా చప్పట్లు కొట్టడాన్ని చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందినవారు అవుతారు.

రోజు ఉదయాన్నే 5 నిమిషాల పాటు రెండు చేతులు ముందుకు చాచి చప్పట్లు కొట్టడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చట.

మెడనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక స్థితి బాగా లేకపోయినవారు సైతం చప్పట్లు కొడితే మంచి ప్రయోజనాలు ఉంటాయట.

చప్పట్లు కొట్టడం ద్వారా మధుమేహాన్ని కూడా పూర్తిగా నియంత్రణలోకి తీసుకురాచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

కొవ్వు, కంటి చూపు సమస్యలు ఉన్నవారు సైతం చప్పట్లు కొట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

చప్పట్లు కొట్టడం ద్వారా ఉచితంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నిపుణులు తెలియజేస్తున్నారు.  

చప్పట్లు కొట్టడం ద్వారా ఇన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలిశాకా ఇంకెందుకు ఆలస్యం.. 

మీరు కూడా మీ రోజు వారి వ్యాయమంలో చప్పట్లు కొట్టడం ప్రారంభించి ఆరోగ్యంగా ఉండండి.