హిందూ ఆచార సంప్రదాయాలల్లో పశువులను, మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు

ముఖ్యంగా మొక్కలను పూజించే విషయంలో తులసికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.

చాలా మంది తమ ఇళ్లలో తులసి మొక్కను పెట్టి పూజలు చేస్తుంటారు.

తులసిని ఎలా బడితే అలా పెంచకూడదు అంటున్నారు వాస్తు నిపుణులు.

కొన్ని వాస్తు నియమాలు పాటిస్తూ తులసి మొక్కను పెంచాలని నిపుణులు చెబుతున్నారు.

తులసి  మొక్కను లేదా తులసి కోటను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిక్కున ఉంచాలి.

ఆ దిక్కుల్లో ఉంచడం ద్వారా పాజిటీవ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

తులసి మొక్కను ఉంచిన ప్రదేశం చాలా పరిశుభ్రంగా, కాంతి వచ్చే విధంగా ఉండాలంట.

తుక్కు, దుమ్ము, చెత్త ఉన్న ప్రాంతంలో  తులసిని ఉంచరాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు

అలా అశుభ్రమైన ప్రదేశాల్లో తులసి మొక్కను ఉంచితే ప్రతికూలం ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

తులసి మొక్క ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.

తులసిని కొంచెం ఎత్తు ఉండే ప్రదేశాల్లో ఉంచాలి. తులసి కోటలో గానీ, ఏదైనా కుండీలో గానీ ఉంచొచ్చు.

తులసి మొక్కకు రోజు తప్పనిసరిగా నీరు అందించాలి. 

తులసి మొక్క ఎంత ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో అంత ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంట.

తులసి మొక్కకు రోజూ ఉదయం వేళ పూజ చెయ్యాలి.

అయితే తులసి మొక్కల గురించి వివరించిన వాస్తు విషయాలు నిపుణుల అభిప్రాయాలు మాత్రమే.