హిందువులు దేవుళ్లను ఎంతో భక్తి శ్రద్దలతో కొలుస్తుంటారు.

సోమవారం, శనివారం అంటూ ఇలా ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తూ తమ కోరికలను దేవుడికి విన్నవించుకుంటుంటారు.

చాలా మంది ఇళ్లల్లో దేవుడిని పూజించేందుకు ప్రత్యేకంగా ఓ గదినే నిర్మించుకుంటుంటారు. 

అలా వాస్తు శాస్త్రం ప్రకారం.. పూజ గది ఎక్కడ ఉండాలో అక్కడి నిర్మించుకుని దేవుడికి పూజలు చేస్తుంటారు. 

కొంత మంది ఇళ్లల్లో దేవుడి విగ్రహానికి పూజలు చేస్తుంటే.. చాలా మంది మాత్రం దేవుడి ఫోటోకు మాత్రమే పూజలు చేస్తుంటారు. 

అసలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దేవుడి విగ్రహానిక పూజలు చేయడం మంచిదా? లేక దేవుడి ఫోటోకు పూజలు చేయడం మంచిదా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతున్న కాలానికి అనుగుణంగా దైవ భక్తిని ఒక్కోరు ఒక్కోలా చూపిస్తుంటారు.

చాలా మంది విగ్రహాలకు,  ఫోటోలకు పూజలు చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం తమ మదిలోనే తలుచుకుంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

దేవుడి ఫోటోకు పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితం దక్కదని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

దేవుడి విగ్రహారాధనకే ఎక్కువ ఫలితాలు ఉంటాయని కొందరు జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.  

విగ్రహారాధన చేసే క్రమంలో ఒక ఆసనంలో కూర్చుని పూజలో పాల్గొనాలట. అలా అయితేనే మనం చేసే పూజకు ఫలితం ఉంటుంది.

దేవుడి ఫోటోకు పూజ చేసే సమయంలో మాత్రం ఎలాంటి ఆసనంలో కూర్చోవాల్సిన పని లేదని వారు చెబుతున్నారు.

విగ్రహారాధన సమయలో తప్పక స్నానం చేసి దేవుడి పూజలో పాల్గొనాలి

దేవుడి ఫోటోకు పూజ చేసే సమయంలో తప్పక స్నానం చేయాల్సిన పని లేదని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇంట్లో చేసే పూజలో దేవుడి విగ్రహం 6 అంగుళాలు మంచి పెద్దదిగా ఉండకూడదని జ్యోతిష్య శాస్త్రం తెలిచేయజేస్తుంది.