ఇంట్లోనే ఉంటూ 20 నిమిషాలకు రూ. 500 సంపాదించుకునే అవకాశం మీ కోసమే.

మీకు టైపింగ్ మీద పట్టు ఉంటే గంటకు రూ. 1500 సంపాదించుకోవచ్చు.  

ఇది ప్రభుత్వ ఉద్యోగమే. ఎటువంటి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినది కాదు.

స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ది పూర్ ఇన్ ఇండియా (స్పైర్ ల్యాబ్) ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అవకాశాలను కల్పిస్తోంది.

ఇందులో స్పీచ్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్, సెంటెన్స్ కంపోజిషన్, సెంటెన్స్ ట్రాన్స్లేషన్, కంటెంట్ రైటర్, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయి.

ప్రస్తుతం స్పీచ్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్, సెంటెన్స్ కంపోజిషన్, సెంటెన్స్ ట్రాన్స్లేషన్ విభాగాల్లో మాత్రమే జాబ్స్ ఖాళీగా ఉన్నాయి.  

స్పీచ్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ జాబ్: స్థానిక యాసలో వారు పంపే కంటెంట్ ని ఆడియోలోకి కన్వర్ట్ చేయాలి. అలానే ఆ మాటలను మీ స్థానిక యాసలో టైప్ చేసి పంపించాలి. 

జీతం: 20 నిమిషాలకు రూ. 500 చెల్లిస్తారు.

సెంటెన్స్ కంపోజిషన్: వారు పంపే కంటెంట్ లోని వాక్యాలను సరైన శైలిలో మీ స్థానిక యాసలో కంపోజ్ చేయాలి.  

జీతం: 200 వాక్యాలకు రూ. 1000 చెల్లిస్తారు.

సెంటెన్స్ ట్రాన్సిలేషన్: వారు పంపించిన కంటెంట్ లోని వాక్యాలను మీ స్థానిక యాసలో అనువాదం చేయాలి. 

జీతం: 1000 పదాలకు రూ. 2000 చెల్లిస్తారు.

స్కిల్స్: కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. టైపింగ్ వచ్చి ఉండాలి. 

తెలుగు రాయడం రావాలి. యాసలో రాయగలగడం, మాట్లాడడం రావాలి.

ఖచ్చితంగా కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ఉండాలి.

జాబ్ లొకేషన్: ఎక్కడ నుంచైనా చేయవచ్చు. ఇంట్లో ఉండి కూడా చేయవచ్చు.