పిప్పళ్లు అంటే నేటితరం వారికి పెద్ద తెలియక పోవచ్చు. కానీ మన ముందుతరం వాళ్లకి బాగా తెలుసు.

పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఈ పిప్పళ్లు తప్పనిసరిగా ఉండేవి.

పిప్పళ్లలో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. 

పిప్పళ్ల వ‌ల్ల క‌లిగే ఆరోగ్యక‌ర‌మైన ప్రయోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

క‌డుపు నొప్పి, అజీర్తితో బాధ‌ప‌డే వారు పిప్పళ్లను, వ‌స‌ను ,ఇంగువ‌ను, క‌రక్కాయ బెర‌డును స‌మ‌పాళ్లలో తీసుకోవాలి.

పొంగించిన ఇంగువ‌తో  మిగిలిన పదార్థాలను కలిపి పొడిగా చేసి వీట‌న్నింట‌నీ క‌లిపి నిల్వ చేసుకోవాలి.

నిద్రలేమితో బాధ‌ప‌డే వారు పిప్పళ్లను తీసుకుని దోర‌గా వేయించి పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి. 

రోజూ రాత్రి ప‌డుకునే ముందు మూడు వేళ్లకు వ‌చ్చినంత మోతాదులో ఆ పొడిని తీసుకుని బెల్లంతో క‌లిపి తినాలి. 

అలా చేస్తే ఎంతోకాలం నుండి వేధిస్తున్న నిద్రలేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. 

పిప్పళ్ల, తేనెను,  మూడు వేళ్లకు వ‌చ్చినంత చూర్ణాన్ని తీసుకుంటే మంచిది

ఇలా పిప్పళ్లు, తేనె చూర్లం కలిపి తీసుకోవడం ద్వారా క‌ఫ జ్వరాలు త‌గ్గుతాయి.

పాండు రోగంతో బాధ‌ప‌డే వారు కూడా పిప్పళ్ల చూర్ణంతో నయం చేసుకోవచ్చు.

అందుకోసం పిప్పళ్ల చూర్ణానికి స‌మానంగా బెల్లాన్ని క‌లిపి చిన్న మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. 

ఈ మాత్రల‌ను పూట‌కు ఒకటి చొప్పున రెండు పూట‌లా తీసుకుంటూ ఉంటే పాండు రోగం  తగ్గుతుంది.

సంతాన లేమితో బాధపడుతున్న స్త్రీలకు ఈ పిప్పళ్లు  ఎంతగానో ఉపయోగపడతాయి.

దోరగా వేయించిన పిప్పళ్లను, దూలగొండి గింజ‌ల‌ను, ద్రాక్ష, గొబ్బి గింజ‌లు, ప‌టిక బెల్లాన్ని మిశ్రమాన్ని నిల్వ చేసుకోవాలి. 

ఆ మిశ్రమాన్ని రోజూ కొంచెం తీసుకుంటే గ‌ర్భాశ‌య సమస్యలు తొల‌గి స్త్రీ లు గ‌ర్భం ధ‌రిస్తార‌ని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ చిట్కాలు పాటించే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.