మన సమాజంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉన్నాయి.
అలానే అన్నాచెల్లెళ్ల బంధానికి ఎంతో పవిత్రత ఉంది.
తోడబుట్టిన వాళ్లు కాకపోయినా సరే.. ఓ అబ్బాయిని అన్నా అని.. అమ్మాయిని అక్క అని పిలిస్తే.. ఇక జీవితాంతం అదే వరుసకు కట్టుబడి ఉంటాం.
కలలో కూడా వారి గురించి తప్పుగా ఆలోచించం. తోబట్టువులు కాకపోయినా.. వారిని సోదర భావంతోనే చూస్తాం.
వారిని పెళ్లి చేసుకోవడం కాదు కదా.. కనీసం మనసులో కూడా వాళ్ల గురించి ఎలాంటి తప్పుడు ఆలోచనలు చేయం.
ఎందుకంటే.. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అనే బంధాలకు మన సమాజంలో ఎంతో పవిత్ర స్థానం ఉంది.
కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే జంట మాత్రం.. ఆ బంధాన్ని గాలికి వదిలేసి.. వివాహం చేసుకున్నారు.
వీరి విచిత్ర ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చిన్నప్పటి నుంచి అన్నయ్య అని పిలిచిన వ్యక్తిని.. సదరు మహిళ వివాహం చేసుకుంది.
వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇక మహిళ తమ ప్రేమ కథ గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇది వైరలవుతోంది.
ఈ విచిత్ర ప్రేమకథలో దంపతుల పేర్లు.. విని, జై. వీరిద్దరి పేరు మీద ఇన్‌స్టాలో ఒక అకౌంట్ ఉంది.
భార్యాభర్తలిద్దరూ వీడియోలు, రీల్స్ చేసి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఇక అప్పుడప్పుడు ఈ జంట తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి కూడా రీల్స్, వీడియోలు చేస్తూ.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఈ జంట తమ గురించి ఓ షాకింగ్ విషయం ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోవడంతో పాటు.. అసహ్యించుకుంటున్నారు కూడా.
ఈ జంట తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో వారి ప్రేమ, పెళ్లి గురించి చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలో సదరు మహిళ.. తన భర్త జై ని.. చిన్ననాటి నుండే భయ్యా (అన్నయ్య) అని పిలిచే దాన్ని అని స్వయంగా వెల్లడించింది
చిన్నప్పుడూ స్నేహితులుగా ఉన్నా.. పెద్దయ్యాక ఆ స్నేహం కొనసాగించలేకపోయాం అన్నది.
పైగా జై... వినికి దూరపు బంధువు కావడంతో.. సుమారు ఎనిమిదేళ్ల పాటు.. తనని అన్నయ్య అని పిలిచానని తెలిపింది.
ప్రారంభంలో తమ ఇద్దరి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం ఉన్నా.. ఆ తర్వాత అది స్నేహంగా.. ఆపై ప్రేమగా మారిందని చెప్పుకొచ్చింది ఈ జంట.
ఈక్రమంలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో తాము వివాహం చేసుకున్నామని చెప్పుకొచ్చింది.
అంతేకాక ప్రస్తుతం తమకు ఓ బిడ్డ ఉన్నట్లు వెల్లడించారు.
వీరిపై లవ్ స్టోరీపై నెటిజనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కొందరు విమర్శిస్తున్నారు.. కొందరు సంతోషంగా ఉండండి అంటూ ఆశీర్వదిస్తున్నారు.