కన్నబిడ్డలనే కాలదన్నుకుంటున్న రోజులివి. కడుపున పుట్టిన పిల్లలను సైతం తమ స్వార్థం కోసం వేధిస్తున్న కాలాలివి.

అలాంటి ఈ రోజుల్లో కూడా ఓ యువతి ఉన్నంతంగా ఆలోచించింది.

 చనిపోయిన తన అక్క బిడ్డల బాగు కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కుంచనపల్లికి చెందిన ఓ మహిళ కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ టైంలో మృత్యువాతపడింది.

ఇక, అప్పటినుంచి ఆమె బిడ్డలు తల్లి లేని లోటును అనుభవిస్తూ ఉన్నారు.

ఆడతోడు లేని కుటుంబం కావటంతో  పిల్లలతో సహా బావ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు.

అక్క పోయిన తర్వాత ఆ పిల్లలు పడుతున్న బాధను చూసి వారి పిన్ని చలించిపోయింది.

 ఎలాగైనా వారిని అన్నీతానై చూసుకోవాలని అనుకుంది.

ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అయితే, వారు ఇందుకు ఒప్పుకోలేదు.

అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. తర్వాత ఇంట్లో వాళ్లు ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు.

 చంపుతామని కూడా బెదిరించారు. ఈ నేపథ్యంలోనే బావ,మరదలు ఓ నిర్ణయానికి వచ్చారు.

పోలీస్‌ స్టేషన్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తాజాగా, పోలీస్‌ స్టేషన్‌లో పెళ్లి చేసుకున్నారు.

తన అక్క బిడ్డల సంతోషం కోసమే తాను బావను పెళ్లి చేసుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

అక్క బిడ్డల బాగుకోసం తన జీవితంలోకి వచ్చిన మరదలిని ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ఆ బావ వాగ్ధానం చేశాడు.