నేటికాలంలో ప్రతి ఒక్కరు సుఖవంతమైన ప్రయాణం కోరుకుంటారు.

ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి వివిధ సంస్థల క్యాబ్, బైక్ లను బక్ చేసుకుని ప్రయాణిస్తుంటారు.

అలానే వీటి ద్వారా ప్రయాణం చేయడంతో టైమ్ సేవ్ అవుతుందని చాలామంది భావిస్తుంటారు.

ఇక యువతులు సైతం రైడింగ్ బైక్స్ ను  బుక్  చేసుకుని  ప్రయాణాలు చేస్తుంటారు.

తాజాగా బెంగళూరులో జరిగిన ఓ ఘటనతో వారికి ఈ రైడింగ్ క్యాబ్స్, బైక్స్ సేఫే నా అనే సందేహం వ్యక్తమవుతుంది.

బెంగుళూరులో 30 ఏళ్ల మహిళ పట్ల  ర్యాపిడో బైకర్ వికృతంగా ప్రవర్తించాడు.

ఈ నెల 21న రాత్రి 11.30 గంటల సమయంలో తన ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ను బుక్‌ చేసింది.

మహిళను పికప్‌ చేసుకున్న సదరు బైకర్‌ ఆమె మొబైల్‌ను లాక్కున్నాడు.

అనంతరం బైక్ స్పీడ్ పెంచి ఆమె పట్ల వికృతంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.

అంతేకాక ఆ మహిళను కౌగిలించుకుని వెకిలిచేష్టలు చేశాడు.

వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో తీసుకెళ్తుండగా మహిళ అతడిని ప్రశ్నించింది.

అయితే అతడు సమాధానం ఇవ్వకుండా  బైక్ ను మరింత వేగంగా పోనిచ్చాడు.

బీఎంఎస్‌  ఇన్‌స్టిట్యూట్‌ వద్దకు రాగానే  నుంచి బైక్ పై నుంచి మహిళ దూకేసింది.

ప్రస్తుతం ఆ మహిళ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

మహిళ ఇచ్చిన ఆధారల ద్వారా నిందితుడైన ర్యాపిడో బైకర్‌ను అరెస్ట్‌ చేశారు.

అయితే ఈ ఘటనతో మహిళలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు.

రైడింగ్ బైక్స్ మహిళకు సేఫ్ కాదా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.