దేశభక్తి అనేది ఓ భావోద్వేగమైన అనుభూతి. ఆ దేశంలో నివసించే వారికి మాత్రమే అదేంటో అర్థమవుతుంది.
మాతృదేశంపై ప్రేమ లేని వారుండరు. దాదాపుగా అందరు పౌరులు తమ దేశాన్ని ప్రేమిస్తుంటారు.
పుట్టిన నేలను గౌరవించాలని పెద్దలు కూడా చెబుతుంటారు.
దేశం మీకు ఏం ఇచ్చిందనేది కాదు.. మీరు దేశానికి ఏం ఇచ్చారనేదే ముఖ్యం అని పెద్దలు కూడా అంటుంటారు.
దేశం మీద ప్రేమతో ప్రాణాలను అర్పించడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉంటారు.
అందుకు దేశ స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుంటారు.
దేశంపై ప్రేమ ఉన్న ప్రతిఒక్కరూ జాతీయ జెండానూ గౌరవిస్తారు. వీలు కుదిరినప్పుడు జెండాపై ప్రేమ, ఇష్టాన్ని చూపిస్తుంటారు.
ఆటల్లో గెలిచినప్పుడు, ఏదైనా ప్రతిష్టాత్మక పురస్కారాలు సాధించినప్పుడు, ప్రధాని స్థాయి వ్యక్తులు వస్తున్నప్పుడు జాతీయ జెండాలను పట్టుకుని తిప్పుతుంటారు.
అయితే జాతీయ జెండాపై తన మమకారాన్ని చూపించడం ఓ అమ్మాయి చేసిన తప్పైంది.
జాతీయ జెండాను ముఖంపై పెయింటింగ్‌లా వేసుకున్న అమ్మాయిని పంజాబ్, అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలోకి రానివ్వలేదు.
ఆ అమ్మాయిని అడ్డుకున్న గురుద్వారా సిబ్బంది.. ‘ఇది పంజాబ్, ఇండియా కాదు’ అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ఆయనతో ఆ అమ్మాయి వాగ్వాదానికి దిగింది.
గురుద్వారా సిబ్బందితో ఆ అమ్మాయి వాగ్వాదానికి దిగిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంత జరుగుతున్నా అసలు పంజాబ్ పోలీసులు ఏం చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు.