కాఫీ తాగనిదే చాలా మందికి ఆ రోజు మొదలవ్వదు. అంతలా దీనికి అడిక్ట్ అయిపోతారు.
కాఫీ అంటే చాలా మందికి ఓ స్ట్రెస్ బస్టర్ లాంటిది.
రుచి, కమ్మదనంలో కాఫీకి సాటివచ్చే తేనీరు లేదని అంటుంటారు. అది తాగాక వచ్చే తాజాదనం, ఆ అనుభూతి వేరు అని కాఫీ లవర్స్ చెబుతుంటారు.
అయితే ఇష్టం వచ్చినట్లు రోజుకు ఎన్నిపడితే అన్ని, ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ తాగొద్దు. అలా చేస్తే బెడిసికొట్టే ప్రమాదం ఉంది.
కాఫీ తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇదో చక్కటి మార్గం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
సమ్మర్లో సాధారణ కాఫీ బదులు బరువు తగ్గించే కోల్డ్ కాఫీలు తాగడం మేలని సూచిస్తున్నారు.
1:12 నిష్పత్తిలో రాత్రి నీటిలో కాఫీ గింజలను ఉంచి వాటికి మిక్సీ పట్టాలి. దీనిని పాలు లేకుండా కాఫీలా చేసుకోవాలి.
ఈ కాఫీలో తియ్యదనం కోసం చక్కెర, బెల్లం పొడి లేదా తేనె వేసి కలుపుకోవచ్చు. అయితే అవి వేసుకోకుండా తాగితే బెటర్. దీని వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క కాఫీ తగ్గినా వెయిట్ తగ్గుతారని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కప్పు బ్లాక్ కాఫీకి ఎస్ప్రెస్సో షాట్, చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలపి తాగాలి.
దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కెఫీన్‌తో కలసి బరువు తగ్గించడాన్ని వేగవంతం చేస్తాయి.
ఇంట్లోనే తయారు చేసుకునే సులువైన కాఫీల్లో ఐస్ కాఫీ ఒకటి. ఒక గ్లాసులో కొద్దిగా ఐస్, నీరు కలపాలి.
ఇందులో లో ఫ్యాట్ బాదం మిల్క్, అలాగే ఏదైనా స్వీట్నర్ను కొద్దిగా కలిపి ఆస్వాదించాలి.
బరువు తగ్గేందుకు లెమన్ కాఫీ తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. తాజాగా తయారు చేసిన కాఫీకి కొద్దిగా నిమ్మరసం, దాల్చిన చెక్క పొడిని కలపాలి.
ఈ మూడింటి కాంబినేషన్‌తో జీవక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని ట్యాక్సిన్స్ బయటికి వెళ్లి, బరువును తగ్గేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.