తెలంగాణ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన సినిమా బలగం. ఈ సినిమాలో బంధుత్వాల గురించి బలంగా  చెప్పారు దర్శకుడు వేణు.

ఎక్కడ చూసినా ఈ సినిమా చర్చగా మారింది.  ఇందులో ప్రతి సన్నివేశం కట్టిపడేస్తుంది.

ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్‌లో అయితే కంతటడి పెట్టని వారుండరు. అంతలా ఆకట్టుకుంది.

 ఈ సినిమా పిండ ప్రదానం  చుట్టూనే తిరుగుతుంది.

చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహారాలన్నింటిని కూడా వండి అతని 3 రోజుల  చిన్నదినం, తర్వాత 5వరోజు, చివరగా 11వ రోజున ఉంచుతారు కుటుంబ సభ్యులు

అయితే తొలి రెండు రోజుల్లో పక్షి ముద్ద ముట్టదు. దశ దిన కర్మ రోజు  పక్షి ముద్ద ముట్టకపోతే.. వారి ఆత్మ ఘోషిస్తుందని కథ ద్వారా చెబుతాడు.

మరీ నిజంగా పిట్ట ముద్ద ముట్టకపోతే ఆత్మలు శాంతించివా.. కుటుంబానికి ఊరికి అరిష్టం పడుతుందా..?

ఈ వాదనలో వాస్తవం అటు ఉంచితే..  గరుడ పురాణం ఏం చెబుతోందంటే..?

గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ ప్రేతాత్మగా మరి పక్షి రూపంలో అక్కడే అదే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి స్మశాన వాటిక వద్దకు వెళ్లి మొక్కుతారు.

అలా మొక్కడం వల్ల పక్షి రూపంలో మనిషి ఆత్మ వచ్చి వాటిని రుచి చూసి వెళ్తుందని ..దాని ఫలితంగా ఆత్మ శాంతిస్తుందని భావిస్తుంటారు.

మనిషి చనిపోయిన 11 రోజులు పిండ ప్రధానం చేసి కాకి పెట్టడం జరుగుతుందన్నారు.

ఒకవేళ మనం పెట్టిన ఆహార పదార్థాలు పక్షి ముట్టకపోతే ఎక్కడో ఏదో లోపం జరిగిందని, మా ఇంట్లో ఏదో అరిష్టం జరిగిందని పల్లెటూర్లలో ఎక్కువ నమ్ముతారని అంటున్నారు

అయితే ఈ సినిమాలో చివరికి కుటుంబ సభ్యులు అంతా ఏకమై ముద్ద పెట్టగా పక్షి తింటుంది. 

పల్లెటూరు అందాలు, దాని చుట్టూ అల్లుకున్న కథ సక్సెస్ బాట పట్టడమే కాదూ.. చాలా కాలంగా గొడవలు ఆడుకుని కుటుంబాలు కూడా కలిశాయి.