శృంగారం అనేది పురుషుల జీవితంలో అద్బుతమైన అనుభవం. ఆడవాళ్ల కంటే ఎక్కువగా పురుషులకు శృంగారం మీద ఆసక్తి ఉంటుంది. ఆ అనుభవం కోసం తహతహలాడుతుంటారు. అన్నిట్లో కింగ్‌లా ఉండే మగాళ్లు శృంగారంలోని కొన్ని విషయాల్లో చాలా భయస్తుల్లా ఉంటారు.

ఇది 70-80 శాతం మగాళ్లకు సంబంధించిన అక్షర సత్యం. శృంగారానికి ముందు ఎంతో చక్కగా శృంగార భాగస్వామితో మాట్లాడే మగాళ్లు.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోతారు. మాట్లాడను కూడా మాట్లాడరు.

ఇలా ఎందుకు జరుగుతుంది? మగాళ్లు ఎందుకు శృంగారం తర్వాత మాట్లాడటానికి ఇష్టపడరు? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శృంగారం తర్వాత మగాళ్లు మాట్లాడకపోవటానికి ముఖ్యంగా 4 కారణాలు ఉంటాయి. అవేంటంటే..

శృంగారంలో తమ పనితనం..

కొంతమంది మగాళ్లు ప్రతీ విషయాన్ని పట్టి పట్టి చూస్తారు. ప్రతీ దాని గురించి లోతుగా ఆలోచించి ఇబ్బంది పడిపోతుంటారు. ముఖ్యంగా కొన్ని రకాల ఇన్‌ఫీరియారిటీలు కూడా ఉంటాయి. శృంగారం విషయంలోనూ ఇదే జరుగుతుంది.

శృంగారం తర్వాత చాలా మంది మగాళ్లు ఈ విధంగా ఆలోచిస్తారు.

నేను నా భాగస్వామిని బాగా సుఖపెట్టానా? నేను ఎక్కువ సేపు చేయలేకపోయానేమో? నేను సరిగ్గా చేయలేకపోయానని ఆమె అనుకుంటుందేమో? ఇలా ఆలోచిస్తారు. ఆ భయంతోనే పార్ట్‌నర్‌తో మాట్లాడటానికి భయపడతారు.

క్లింగీ అనే పదానికి తెలుగులో ‘అతుక్కుపోవటం’ అనే అర్థం ఉంది. శృంగారం తర్వాత కొంతమంది మహిళలు మగాళ్లను అతుక్కుపోతారు.

క్లింగీగా ఉండటం..

ఇలా చేయటం అందరు మగాళ్లకు ఇష్టం ఉండదు. ఈ కారణం వల్ల కూడా మగాళ్లు శృంగారం తర్వాత దూరంగా జరిగి, మౌనంగా ఉండిపోతుంటారు.

శృంగారంలో సంతోషం లేకపోవటం..

మనం కోరుకున్నది మనం అనుకున్నంతగా సంతోషాన్ని ఇవ్వలేకపోతే బాధ ఉండనే ఉంటుంది. శృంగారం విషయంలోనూ ఇదే విర్తిస్తుంది. మగాళ్లు శృంగారంలో మంచి అనుభవాన్ని పొందలేకపోతే నిరాసకు గురవుతారు.

అందుకే దూరంగా జరిగిపోయి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఇలాంటి సమయంలో ఆడవాళ్లే చొరవ తీసుకోవాలి. శృంగారంలో మంచి అనుభూతి కలిగిందా లేదా అని అడగాలి.

కమిట్‌మెంట్‌ అడుగుతారేమోనన్న భయం !

శృంగారంలో పాల్గొనే ఆడ,మగ భార్యాభర్తలు మాత్రమే కావాలన్న రూలేమీ లేదు. ప్రియుడు, ప్రియురాలు కావచ్చు.. విటుడు, వ్యభిచారిని కావచ్చు.

ఎలాంటి సంబంధం లేకుండా ఉండి శృంగారం చేస్తే గనుక మగాళ్లు సదరు శృంగార భాగస్వామితో మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపరు.

ఎందుకంటే.. ఆమె, అతడ్ని ఏదైనా కోరుతుందన్న భయం. ముఖ్యంగా ప్రియురాలిని మోసం చేసే ప్రియుళ్లు ఇలా చేస్తుంటారు.

కమిట్‌మెంట్‌ ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో మగాళ్లు శృంగారం తర్వాత ఆడవాళ్లకు దూరంగా ఉంటారు.