ప్రమాదం జరిగినప్పుడు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అంబులెన్స్ వస్తుంది.

ఈ అంబులెన్స్ పై రాసి ఉండే ఇంగ్లీష్ అక్షరాలు తిరగరాసి ఉంటాయి.

అంబులెన్స్ పై అలా ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా..?

 అంబులెన్స్ పై అక్షరాలు తిరిగేసి రాయడానికి ఓ బలమైన కారణం ఉందంట.

 మరి అంబులెన్స్‌పై అక్షరాలు ఎందుకు తిరగరాసి ఉంటాయో తెలుసుకుందాం.

ప్రాణపాయస్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ను వినియోగిస్తారు.

ఈ వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడుతుంటారు.

ఈ అంబులెన్స్ కి ట్రాఫిక్‌ అవాంతరాలు ఏర్పడకుండా కొన్ని సూచనలు పాటిస్తారు.

అందులో ఒకటి.. ప్రత్యేకంగా శబ్దం వచ్చే సైరన్‌ మోగించడం.

వాహనం బాగా కనిపించేలా ఎరుపు, నీలం రంగుల్లో తిరిగే లైటును అంబులెన్స్ పై ఏర్పాటు చేస్తారు.

అంబులెన్స్ కు ముందు వాహనాదారులు గుర్తించేలా దానిపై అక్షరాలను తిరగరాసి ఉంటాయి.

వాహనాల డ్రైవర్లందరూ తమ వెనుక ఏయే వాహనాలు వస్తున్నాయో తెలుసుకోడానికి ‘రియల్ వ్యూ మిర్రర్‌’ అనే అద్దం ఉపయోగిస్తారు. 

రియల్ వ్యూవ్ అద్దం ద్వారా చూసినప్పుడు వెనక వాహనంపై అక్షరాలు స్పష్టంగా కనబడుతుంటాయి.

అలానే అక్షరాలను తిరగ రాస్తే.. ఇంకాస్త స్పష్టంగా కనిపిస్తాయంట.

అందుకే అంబులెన్స్‌ వాహనం మీద రాసిన అక్షరాలు తిరగేసి రాస్తారు.

దీని వల్ల ముందున్న వాహనదారులు.. అంబులెన్స్‌ ను గమనించి దారి ఇస్తారు.