పనీర్ ని ఇష్టపడని ఆహారులు ఉండరు. దాదాపు అందరూ ఈ పనీర్ ని ఇష్టపడతారు.

శాఖాహారులకి పనీర్ అంటే మాంసాహారంతో సమానం. 

పనీర్ లో ఫాస్ఫరస్, కాల్షియం, ఫైబర్లు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. 

అందుకే పనీర్ ని చాలా మంది ఇష్టంగా లాగించేస్తుంటారు.  

పనీర్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ ప్రోటీన్ల మోతాదు ఎక్కువైతే డయేరియా సమస్యకి దారి తీస్తుంది.

వాంతులు, విరేచనాలు అధికంగా అవుతాయి. అందుకే విరేచనాలు అవుతున్నప్పుడు పొరపాటున కూడా పనీర్, జున్ను తినకూడదు. 

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు పనీర్ అస్సలు తినకూడదు. దీని వల్ల రక్తపోటు మరింత పెరిగే అవకాశం ఉంది. 

కొంతమందికే పాల ఉత్పత్తుల వల్ల అలర్జీ వస్తుంది. ఈ సమస్య ఉన్నవారు పనీర్ తినకపోవడమే మంచిది.

ఎందుకంటే పనీర్ తింటే అలర్జీ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పనీర్ లో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. 

ఎక్కువ మొత్తంలో పనీర్ ని తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.

దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు పనీర్ జోలికి పోకూడదు. 

రాత్రి సమయంలో పనీర్ అస్సలు తినకూడదు. త్వరగా అరిగి చావదు. దీని వల్ల అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.