అవిసె గింజల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఒమేగా 3, ఒమేగా 6, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. గుండె సమస్యలని తగ్గిస్తాయి.
జీర్ణక్రియను, మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి.
అవిసె గింజల్లో ఉండే పోషకాలు చర్మ సౌందర్యానికి దోహదపడతాయి.
ఒక చెంచాడు అవిసె గింజలను సగం కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే ఆరోగ్యం, అందం మీ సొంతమవుతుంది.
ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఏడీహెచ్డి, హైడర్ టెన్షన్ వంటి వ్యాధులను నయం చేసే గుణం ఈ అవిసె గింజలకు ఉంది.
ఆరోగ్యానికి మేలు చేసేవైనా వీటిని అందరూ తినకూడదు. కొందరు మాత్రమే తినాలి.
అవిసె గింజలను ఎవరు తినాలి?
పోషకాహార లోపం, పీరియడ్స్ లో తక్కువ ప్రవాహం, కీళ్ల నొప్పులు, బలహీనత వంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా అవిసె గింజలు తినాలి.
బరువు తక్కువగా ఉండేవారు వీటిని తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.
డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు ఈ అవిసె గింజలను తింటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
అవిసె గింజలను ఎవరు తినకూడదు?
అధిక ఋతుస్రావం అవుతున్న వారు, గర్భం ధరించడానికి ప్రయత్నించే వారు అవిసె గింజలను తినకూడదు.
శరీరంలో వేడి ఎక్కువ ఉన్నవారు, తక్కువ లిబిడోతో పోరాడుతున్నవారు వీటిని తినకపోతేనే మంచిది.