ఈ మధ్యకాలంలో ఒరిజినల్ సినిమా పాటలకు కవర్ సాంగ్స్ చేయడం మామూలే అయిపోయింది

అలా ఓ సింగర్ శ్రీలలిత కాంతార సినిమాలోని ‘వరాహ రూపం’ పాటని కొత్తగా రీక్రియేట్ చేసి వార్తల్లో నిలిచింది.

తెలుగు బుల్లితెరపై ఎన్నో సింగింగ్ కాంపిటీషన్స్ లో తన ప్రతిభ చాటిన సింగర్ శ్రీ లలిత ప్రేక్షకులందరికీ సుపరిచితమే

ఎందుకంటే.. బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్, పాడుతా తీయగా, స్వరాభిషేకం, స్వర నీరాజనం, సరిగమప లిటిల్ ఛాంప్స్ లాంటి ప్రోగ్రాంలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది

అప్పుడంటే లిటిల్ ఛాంప్ కదా అని అంతా అనుకున్నారు.. 

కానీ, ఇప్పుడు కాంతార సినిమాలోని ‘వరాహ రూపం’ పాటను కవర్ సాంగ్ చేసి స్టార్ అయిపోయింది శ్రీలలిత.

అదికూడా కజు అనే సరికొత్త సంగీత వాయిద్యంతో పూర్తి పాటను రీక్రియేట్ చేసి కొత్త ట్రెండ్ సెట్ చేసింది

కాంతార సినిమా గురించి, వరాహ రూపం సాంగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

ఆ పాటే సినిమాకు సగం బలం. అలాంటి పాటను కేవలం కజు అనే మౌత్ ఇన్ స్ట్రుమెంట్ తో శ్రీలలిత అద్భుతంగా పెర్ఫర్మ్ చేయడం విశేషం.

కాంతారలో ఒరిజినల్ సాంగ్ ని మేల్ సింగర్ పాడారు. కానీ.. రీక్రియేషన్ లో శ్రీలలిత.. అందరికీ కజు ఇన్ స్ట్రుమెంట్ ని పరిచయం చేస్తూ పాడింది.

ప్రస్తుతం శ్రీలలిత రీక్రియేట్ చేసిన వరాహ రూపం సాంగ్.. సోషల్ మీడియాలో విశేషాధారణ పొందుతోంది

అలాగే సింగర్ గా శ్రీలలితకు తెలుగు నుండే కాకుండా కన్నడ, తమిళ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మరో విశేషం

ఇక తాజాగా శ్రీలలిత సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని.. వరాహ రూపం పాటను కజుతో లైవ్ పెర్ఫర్మ్ చేసింది