అఖండ.. కరోనా తరువాత మళ్ళీ తెలుగు సినిమాకి ఊపిరి పోసిన                మాస్ మూవీ. 

    అఖండలో బాలకృష్ణ నటనకి,   బోయపాటి మాస్ పల్స్ కి, థమన్   మ్యూజిక్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం                  పడుతున్నారు. 

       అఖండలో స్టార్స్ తో సమానంగా    ఓ పాప మంచి క్రేజ్ ని దక్కించుకుంది.   ఈ పాప నటనకి ప్రేక్షకులు అంతా ఫిదా  అయిపోయారు. మరి.. ఆ పాప బ్యాగ్రౌండ్      ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

   అఖండలో అద్భుతంగా నటించిన  ఈ పాప పేరు బేబీ దేష్ణ. బేబీ దేష్ణ తొలి సినిమా అఖండానే. తొలి సినిమాలోనే    బేబీ దేష్ణ అద్భుతమైన నటనని               కనపరచడం విశేషం. 

బేబీ దేష్ణ ఇలా సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఆమె తల్లి ప్రియ అని చెప్పుకోవచ్చు.  దేష్ణ  చిన్నతనం నుండి  ఆమె తల్లి  పాప పేరు మీద ఒక ఇన్ స్టా  అకౌంట్ రన్ చేస్తున్నారు. ఈ పేజ్ కి  1,25,000 మంది ఫాలోవర్స్ ఉండటం                               విశేషం. 

      అఖండ మేకర్స్ కూడా ఈ ఇన్ స్టా       పేజ్ ద్వారానే పాప తల్లిదండ్రులను                    సంప్రదించారట. 

దేష్ణని చూడగానే దర్శకుడు బోయపాటి మరో ఆలోచన లేకుండా పాప క్యారెక్టర్ కి         దేష్ణని ఫైనల్ చేసుకున్నారట

 ఇక అఖండ షూటింగ్ సమయంలోనే బాలకృష్ణకి దేష్ణతో మంచి అనుబంధం ఏర్పడింది. షూటింగ్ సమయంలో దేష్ణ      యాక్టింగ్ కి బాలయ్య సైతం ఫిదా                    అయిపోయారట. 

అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా  బాలయ్య దేష్ణని బాగా ముద్దు చేశారు. 

    మొదటి సినిమాతోనే దేష్ణకి ఇంత     మంచి పేరు రావడంతో పాప తల్లి  ప్రియ చాలా ఆనంద పడుతున్నారు.  

బేబీ దేష్ణ ఇంతో ఉత్సాహంతో రాబోయే     కాలంలో కూడా మరిన్ని సినిమాల్లో        నటించాలని కోరుకుందాము..