సుయాష్ శర్మ..  KKR వర్సెస్ RCB మ్యాచ్కు ముందు ఎవరికీ తెలియని పేరు.

ఈ తర్వాత ఎవరీ సుయాష్ అంటూ క్రికెట్ అభిమానులు గూగుల్లో తెగ సెర్చ్ చేశారు.

ఎంత వెతికినా పెద్దగా సమాచారం లేదు. ఎందుకంటే.. అతను గతంలో పెద్దగా క్రికెట్ ఆడలేదు.

గల్లీ క్రికెట్, చిన్న చిన్న టోర్నమెంట్లు ఆడి.. నేరుగా IPL ఆడే ఛాన్స్ కొట్టేశాడు.

IPL ఆడిన తొలి మ్యాచ్లోనే పటిష్టమైన RCBని వణికించాడు. 3 వికెట్లు సైతం పడగొట్టాడు. 

ఈ మిస్టరీ బౌలర్ చేతిలో దినేష్ కార్తీక్ లాంటి పవర్ హిట్టర్ సైతం అవుట్ అయ్యాడు.

దీంతో ప్రస్తుతం సుయాష్ శర్మ టాక్ ఆఫ్ది క్రికెట్ టౌన్గా మారిపోయాడు. 

19 ఏళ్ల సుయాష్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. 

ఇప్పటి వరకు ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు. ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ ఇలా ఎందులోనే పాల్గొనలేదు.

KKR టాలెంట్ హాంట్ టీమ్ కంట పడటంతో సుయాష్కు IPL కాంట్రాక్ట్ దక్కింది.

 సుయాష్ బౌలింగ్లో వేరియేషన్స్తో పాటు బౌలింగ్ యాక్షన్ చాలా వైరటీగా ఉంటుంది.

బాల్ రిలీజ్ చేసే సమయంలో అతను ఆకాశం వైపు చూస్తూ వేస్తున్నాడు.

KKR-RCB మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ బరిలోకి దిగాడు.

4 ఓవర్ల కోటా పూర్తి చేసిన సుయాష్ 30 పరుగులు ఇచ్చి.. 3 వికెట్లు పడగొట్టాడు.