విరూపాక్ష ప్రమోషన్స్ తో సోనియా సింగ్ బాగా వైరల్ అవుతోంది.

అయితే విరూపాక్ష సినిమా కంటే ముందే సోనియా సింగ్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

హే పిల్ల అనే యూట్యూబ్ ఛానల్ లో మహిళలకు సంబంధించిన కంటెట్ తో బాగా పాపులర్ అయ్యింది.

కొన్నాళ్లు వీడియోస్ చేయడం ఆపేయడంతో.. ఏమైపోయింది సోనియా అంటూ తెగ వెతుకులాట మొదలుపెట్టారు.

ఫ్యాన్స్ కోసం మళ్లీ రౌడీ బేబీ అంటూ ఛానల్‌ స్టార్ట్‌ చేసి వీడియోస్ చేసింది.

అంతేకాకుండా షార్ట్‌ ఫిల్మ్స్‌, వెబ్ సిరీస్ లతో సోనియా సింగ్ కు మంచి పేరొచ్చింది.

పెళ్ళైన కొత్తలో, న్యూ ఏజ్ గర్ల్ ఫ్రెండ్, నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్, హైడ్ అండ్ సీక్ వంటి ఎన్నో పాపులర్‌ వెబ్ సిరీస్ లు, షార్ట్‌ ఫిల్మ్స్ తో అదరగొట్టింది.

పవన్ సిద్ధుతో నటించిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లకు చాలా గొప్ప ఆదరణ లభించింది.

2020లో సోనియా సింగ్ టీవీ రంగంలోకి అడుగుపెట్టింది.

అలీ ‘యమలీల ఆ తరువాత’ టీవీ సీరియల్ తో సోనియా సింగ్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.

సోనియా సింగ్ మార్చిన 31, 1998లో ముంబైలో జన్మించింది.

ఆమె బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటోంది.

యోగా, ట్రావెలింగ్, పుస్తకాలు చదవడం సోనియా సింగ్ హాబీస్ మాత్రమే కాదు.. ఆమెకు బాగా ఇష్టమంట.

సోనియా సింగ్ చలాకీతనం, సహజంగా ఉండే మాటలు, ఇన్నోసెంట్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఈ మధ్య రీల్స్ తో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.