సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది.
ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పడ్డ కష్టం స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోంది. పుష్పరాజ్ పాత్రలో బన్నీ ఒదిగిపోయిన తీరుకి అంతా ఫిదా అయిపోతున్నారు.
పుష్ప మూవీలో పుష్పరాజ్ పాత్ర తరువాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కేశవ పాత్రే.
సినిమాలో పుష్ప రాజ్ పక్కన మచ్చ అనుకుంటూ నటించిన కేశవ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ కేశవ? ఎక్కడ నుండి వచ్చాడు? ఇతని నేపథ్యం ఏమిటన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేశవ క్యరెక్టర్ లో నటించిన ఇతని అసలు పేరు జగదీశ్ ప్రతాప్ బండారి.
ఇతను చాలా ఏళ్లుగా ఇండస్ట్రీనే నమ్ముకుని ఉంటున్నా.., వచ్చిన అవకాశాలు మాత్రం తక్కువే.
జగదీశ్ పుష్పకి ముందు మల్లేశం, పలాస 1978 అనే సినిమాలో కూడా నటించాడు. కానీ.., ఆ పాత్రలు ఏవి కూడా ఇతనికి పెద్దగా గుర్తింపు తీసుకుని రాలేకపోయాయి.
జగదీశ్ ప్రతాప్ బండారికి అదృష్టం పుష్ప రూపంలో కలసి వచ్చింది. ఇందులో జగదీశ్ కి ఫుల్ లెంగ్త్ రోల్ పడింది. సినిమాలో బన్నీ తర్వాత ఎక్కువగా కనిపించేంది కేశవ క్యారెక్టర్ కావడం విశేషం.
ఇందులో జగదీశ్ అలవోకగా చిత్తూరు యాసలో మాట్లాడుతూ, చాలా సహజంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
చిత్తూరు యాసపై జగదీశ్ కి మంచి పట్టు ఉండటంతో.. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కి జగదీశ్ నే ఫైనల్ చేసుకున్నారట దర్శకుడు సుకుమార్.
సినిమాలో కేశవగా నటించడమే కాదు.. సినిమాని నరేషన్ ఇచ్చింది కూడా అతనే కావడం మరో విశేషం.
పుష్పలో కేశవగా ఇంత మంచి పాత్రలో నటించి మెప్పించిన జగదీశ్ కి రానున్న కాలంలో కూడా మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.