మనలో చాలా మంది ఉదయాన్నే టీ తాగకపోతే రోజు ప్రారంభం కానట్లే భావిస్తారు.

చాలా మంది బెడ్‌ టీతోనే తమ రోజువారి దినచర్యను ప్రారంభిస్తారు.

ఉదయాన్నే వేడి వేడి టీ  గొంతులో పడకపోతే అల్లాడిపోయేవారు ఎందరో.

టీ మన జీవితాల్లో అంతలా భాగం అయిపోయింది. అయితే కొందరు టీ తాగుతూ.. స్నాక్స్‌ తీసుకుంటూ ఉంటారు

అయితే టీ తాగేటప్పుడు, తాగడానికి ముందు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అవేంటంటే..

చాలమంది బరువు తగ్గడం కోసం ఉదయాన్నే ఉల్లిపాయలను తింటారు.

ఇలా పచ్చి ఉల్లిపాయలు తిన్న వెంటనే టీ తాగకూడదు.

అలానే నిమ్మరసం తాగిన వెంటనే కూడా టీ తాగకూడదు.

కొందరు టీ తాగేటప్పుడు శనగపిండితో తయారు చేసిన వివిధ రకాల స్నాక్స్‌ తింటూ ఉంటారు.

అయితే ఇలా చేయకూడదు అంటున్నారు నిపుణులు.

శనగపిండితో చేసిన స్నాక్స్‌ తింటూ, తిన్నాక టీ తాగితే.. అది జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపి.. నష్టం కలిగిస్తుంది అంటున్నారు.

పసుపు లేదా దాంతో తయారు చేసిన పదార్థాలను తిని, తాగిన వెంటనే కూడా టీ తాగకూడదు అంటున్నారు నిపుణులు.

కనుక టీ తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించమని సూచిస్తున్నారు నిపుణులు.