వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ళ మంటరా అని ఎవరో పెద్దమనిషి చెబితే.. కొంతమంది పెద్ద మనుషులు డోంట్ మ్యారీడ్ బీ హ్యాపీ అని పెళ్ళికి దూరంగా ఉంటారు.
ఇంట్లో వాళ్ళు పెళ్లి అంటేనే ఆమడ దూరం పారిపోతారు. అలా పారిపోయే వాళ్ళు ఎక్కువగా ఈ రాశులకి చెందిన వారే అని మీకు తెలుసా?
కుంభ రాశి వారు స్వేచ్ఛగా జీవించేందుకు ఇష్టపడతారు. ప్రతీ మనిషికీ స్వేచ్ఛ ఉండాలని, పెళ్లి పేరుతో ఒక మనిషిని కట్టిపడేయడం కరెక్ట్ కాదన్న భావనతో ఉంటారు.
ఇలాంటి ఆలోచనలు కుంభరాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. అందుకే వీరు పెళ్లి అనే కాన్సెప్ట్ కి దూరంగా ఉంటారు.
మిథున రాశి వారు జీవితాన్ని సరదాగా గడపాలని కోరుకుంటారు. జీవితాంతం సంతోషంగా ఉండాలని భావిస్తారు. పెళ్ళైతే ఆ సంతోషం ఉండదని వీరి అభిప్రాయం.
ఈ మిథున రాశి వారు డోంట్ మ్యారీడ్ బీ హ్యాపీ అనే నినాదానికి కట్టుబడి ఉంటారు. సోలోగా ఉండడానికి ఇష్టపడతారు. అందుకే పెళ్లి అన్న ఊసే వీళ్ళ లైఫ్ లోకి రానివ్వరు.
ధనుస్సు రాశి వారి దృష్టిలో పెళ్లంటే సమస్యల సుడిగుండం. పెళ్ళైతే ఫెయిలైనట్టే అని ఫీలవుతారు.
పెళ్లయ్యాక బతుకు గుట్కా బండి అవుతుందని, బతుకు రచ్చబండకేసి ఉతుక్కున్నట్టు అవుతుందని భయపడతారు.
ఈ సంసారం, బాధ్యతలు, పిల్లలు మన వల్ల అయ్యే పని కాదనుకుంటారు. అందుకే ధనుస్సు రాశి వారు పెళ్లంటే డ్రాప్ అవుతారు.
సింహ రాశి వారు సోలో లైఫే సో బెటరూ అని అనుకుంటారు. సింగిల్ గా ఉందాం, ఎవరితోనూ మింగిల్ అవ్వద్దు అని అనుకుంటారు.
పెళ్ళైతే జీవితం ఎంగిలైపోతుందని వీరి భయం. పెళ్లి బంధంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం కష్టంగా భావిస్తారు.
అందుకే సింహ రాశి వారు పెళ్లి అన్న మాటకు దూరంగా ఉంటారు.
మకర రాశి వారు పెళ్లి నుంచి తప్పించుకోవడానికి కెరీర్ పై ఫోకస్ చేస్తారు. పెళ్లి అంటే పెద్ద భారంగా ఫీలవుతారు.
ఈ రాశుల వారికి అందరికీ ఇలా ఉండకపోవచ్చు. కానీ కొందరికి ఇలా ఉంటుంది. ఇలా పెళ్లి పట్ల ఆసక్తి ఉండకపోవడానికి కారణం వారి రాశిలో ఉన్న దోషం.
అయితే ఈ దోషాన్ని కొన్ని పూజల ద్వారా పోగొట్టవచ్చునని జ్యోతిష్కులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది మాత్రమే.