మనలో చాలామందికి ఇంట్లో ఫేవరెట్ ప్లేస్ బెడ్ రూమ్. అందులో బెడ్ అంటే చాలా ఇష్టం!

కిటికీ వైపు దేవుడు ఉంటాడని, అటు తల పెట్టి పడుకోవద్దని చాలామంది అమ్మలు చెబుతుంటారు.

ఇక ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవద్దని నానమ్మ, అమ్మమ్మ లాంటి వాళ్లు చెబుతుంటారు.

నిద్రకి కూడా వాస్తు ఉంటుందని, అలా చేయకపోతే జీవితంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవని అంటుంటారు.

మరి మనం ఏ దిక్కున తల పెట్టి పడుకోవాలో మీకు తెలుసా?

నిద్రించే దిశ తప్పుగా ఉంటే ప్రశాంతత కోల్పోవడం సహా తరచూ అనారోగ్యాలు, కుటుంబంలో కలహాలు వస్తాయట.

వాస్తు ప్రకారం దక్షిణ దిశలో తల పెట్టి నిద్రపోవడం చాలా శుభప్రదం జరుగుతుంది.

ఇలా చేయడం వల్ల మానసిక సమస్యలు దూరమవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుందట.

దక్షిణం వైపు కాళ్లు పెట్టి పడుకుంటే అశుభం అని, మనలో రక్తహీనత వస్తుందని వాస్తు శాస్త్రం అంటోంది.

దక్షిణం వైపు కుదరకపోతే తూర్పు వైపు తల పెట్టి నిద్రపోవడం మంచిదని పండితులు అంటున్నారు.

ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం లభిస్తుంది. ఇతర దేవతల ఆశీస్సులు ఉంటారని పండితులు చెబుతున్నారు.

ఇంట్లో ఒంటరిగా సంపాదించే వారు.. తూర్పున తల పెట్టి పడుకోవడం మంచిదని విశ్వాసం. 

ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలావరకు అధిగమించొచ్చని వాస్తు పండితులు అంటున్నారు.

స్టూడెంట్స్ కూడా తూర్పు దిక్కున తల పెట్టి నిద్రించాలి. దీంతో చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది.

పాదాలని ఆలయం వైపు, ఇంట్లో దేవుడి గుడివైపు నిద్రపోతుంటారు. ఇలా చేయడం సరికాదు, చాలా అశుభం. ఇలా నిద్రపోకుండా ప్రయత్నించండి.