గడిచిపోయిన కాలం ఎంత మధురమైనదో.. కొన్ని విషయాల్లో అంత ఇబ్బందికరమైనది కూడా.

 ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు ఎదుటి వ్యక్తి గతం గురించి తెలుసుకోకపోటం మంచింది.

అది కూడా వారి స్నేహాలు, ప్రేమ గురించి చర్చించకపోవటం చాలా ఉత్తమం.

ఒక వేళ తెలుసుకున్నట్లయితే కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే.. 

కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.. అవేంటంటే..

ఎదుటి వారి గతంలోని కొన్ని విషయాలు వారిపై ఉన్న నమ్మకాన్ని తగ్గించేలా చేస్తాయి. 

కొన్నిసార్లు ఆ విషయాలను వారితో గొడవలు పడేటప్పుడు ఆయుధంగా వాడే పరిస్థితి వస్తుంది.

ఎదుటి వ్యక్తి గతంలోని ప్రేమలు, స్నేహాలు, పరిచయాల గురించి తెలుసుకున్నపుడు ఇన్‌సెక్యూరిటీ, జలసీ మొదలవుతాయి.

ఎదుటి వ్యక్తి గతం తెలిసినపుడు వారు తీసుకునే నిర్ణయాలపై మన ఆధిపత్యం మొదలవుతుంది. లేనిపోని టెన్షన్‌ తీసుకుని వారిని నొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతాయి.

అందుకే ఎదుటి వ్యక్తి.. వారికి సంబంధించిన విషయాలను మనకు చెప్పటానికి ఇష్టపడనప్పుడు వారి ప్రైవసీని గౌరవించాలి.

అప్పుడే రిలేషన్‌షిప్‌ ధృడంగా తయారు అవుతుంది. ఎలాంటి తలనొప్పులు ఉండవు.