ఇంకా అసలైన వేసవి రాలేదు ఎండలు మాత్రం దంచికొట్టేస్తున్నాయి. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అయితే మిగతా సీజన్ల మాటేమో గానీ ఎండకాలం మాత్రం ఎవరైనా సరే చాలా తర్వగా అలసిపోతారు.
చిన్న చిన్న పనులు చేసినా సరే నీరసం లేదా అలసట వల్ల చాలావరకు రెస్ట్ తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు.
మరికొందరు మాత్రం ఎప్పటిలానే ఎండకాలమైనా సరే టీ, కాఫీ తాగి ఎనర్జీ తెచ్చుకోవాలని అనుకుంటారు.
సమ్మర్ లో వీలైనంత వరకు కెఫిన్ ఐటమ్స్ కు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలానే పోషకాహార లోపమున్నవారు కూడా ఎప్పటికప్పుడు నీరసించిపోతూ ఉంటారు. ఏ చిన్న పనిచేసినా అలసిపోతారు.
వేసవిలో మాత్రమే కాదు ఎప్పుడు అలసటగా అనిపించినా సరే కింద ఐటమ్స్ ని ట్రై చేసి చూడండి. మీ ఎనర్జీ లెవల్స్ ఇట్టే పెరిగిపోతాయి!
అరటిపండు షేక్: అరటిపండుని నేరుగా తీసుకుంటే కొందరికి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వాళ్లు షేక్ తాగితే చాలా బెటర్.
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసేందుకు ఇవి సహకరిస్తాయి.
హెర్బల్ టీ: బయట దొరికే వాటికన్నా ఇంట్లోనే హెర్బర్ టీ తయారుచేసుకోవడం బెటర్. పెద్ద కష్టం కూడా ఏం కాదు.
బాగా బాయిల్ అవుతున్న నీటిలో గ్రీన్ టీ ఆకులు, కొన్ని యాలకులు, అల్లం, పసుపు కలిసి కొంతసేపు మరిగించాలి. వడపోసిన తర్వాత తేనె, నిమ్మరసం కలపాలి.
ఉదయం నిద్రలేచిన తర్వాత ఓ కప్ హెర్బల్ టీ తాగితే బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ జీవక్రియను మెరుగుపరుస్తాయి.
హెర్బల్ టీ తాగడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటాం. రాత్రి నిద్రపోయే ముందు తాగితే అలసట దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మరసం: ప్రతిరోజూ దానిమ్మ జ్యూస్ తీసుకుంటే బీపీ తక్కువగా ఉన్నా, అనవసర కొవ్వుతో బాధపడుతున్న వారి శక్తిస్థాయిలు పెరుగుతాయి.
దానిమ్మ రసంలో విటమిన్ సీ, కే, ఇ పుష్కలంగా ఉంటాయి. మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, జింక్ తదితర ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి.
పుచ్చకాయ, సబ్జా గింజలు: ఎండవల్ల అలసటగా అనిపించినప్పుడు పుచ్చకాయ తీసుకుంటే చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. దీనిలో విటమిన్ సీ, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి.
పుచ్చకాయ జ్యూస్ లో కాస్త సబ్జా గింజలు వేసుకుని తాగితే శరీరానికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి. అలసట కూడా తగ్గుతుంది.
మధుమేహంతో బాధపడేవారు.. అలసటని దూరం చేయాలంటే వాటర్ మేలన్ జ్యూస్ లో సబ్జా గింజలు కలుపుకొని తాగడం చాలా ఉత్తమం.
కొబ్బరినీళ్లు: సమ్మర్ లో ఎండ నుంచి తప్పించుకునేందుకు చాలామంది కొబ్బరినీళ్లు తాగుతారు. ఇది చాలా మేలు చేస్తుంది.
షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచే కొబ్బరినీళ్లు.. శరీరాన్ని కూడా నాజుగ్గా మార్చుతుంది.
బాగా ఆలసటగా అనిపించినప్పుడు కొబ్బరినీళ్లలో కాస్త నిమ్మరసం, తేనె, పుదీనా లేదా కొత్తిమీర వేసుకుని తాగితే నోటికి రుచిగా ఉంటుంది.
పైన చెప్పిన వాటిలో ఏది తీసుకున్నా సరే ఎండవేడి నుంచి తప్పించుకోవడంతో పాటు అలసట కూడా తగ్గే ఛాన్సులు ఎక్కువ.
నోట్: పైన టిప్స్ ఫాలో అయ్యే ముందు మీ దగ్గరలోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.