ఈ సారి పూర్ణిమ తిథి ఆగస్టు 11వ తేదీ గురువారం ఉదయం 10:38 గంటలకు ప్రారంభమవుతుంది.

మరుసటి రోజు ఆగష్టు 12వ తేదీ ఉదయం 07:05 వరకు కొనసాగుతుంది.

 వ్రత నియమాలకు, కృపా కర్మలకు మనం సూర్యోదయం స్పర్శ ఉన్న తిధి.. ఆగస్టు 12వ తారీఖును రక్షా బంధన్‌గా పరగణించాలి.

వ్రతాలు చేసుకునేవారు ఆగస్టు 12వ తేదీ ఉదయం లోపు చేసుకోవాలి.

ఆగస్ట్ 12న ఉదమమే పౌర్ణమి తిథి ముగుస్తుంది కాబట్టి శ్రావణ పూర్ణిమ ఆగష్టు 11న వస్తుంది.

ఇక రాఖీ కట్టే విషయానికి వస్తే.. ఆగస్టు 11వ తేదీన సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టొచ్చు.

శ్రావణ పూర్ణిమ నాడు ఉదయం 09:34 నుండి సాయంత్రం 04:26 వరకు భద్ర సమయం ఉంటుంది.

ఈ కాలంలో రాఖీ పండుగ జరుపుకోకూడదు. 

ఆగస్టు 11 సాయంత్రం 04:26 తర్వాత మాత్రమే సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలి.

సాయంత్రం సౌభాగ్య యోగంలో రాఖీ కట్టడం చాలా మంచిది.