ఈ మధ్యకాలంలో గుండెపోటు కారణంగా సంభవించే మరణాలు బాగా పెరిగాయి.

వయస్సుతో సంబంధం లేకుండా యువకుల్లో సైతం గుండెపోటు సంభవిస్తుంది.

అయితే  గుండె సమస్యల గురించి తరచూ చెక్ చేయించుకుంటే మంచిదని వైద్యులు అంటున్నారు.

టీనేజ్ వయస్సు  దాటినప్పటి నుంచి గుండె సమస్యలపై రెగ్యూలర్ గా టెస్టులు చేయించాలి.

రెండు నుండి నాలుగు సంవత్సరాలకు ఓ సారి గుండెకు సంబంధించి పరీక్షలు చేయించుకుంటే మంచింది.

హైబీపి వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్  ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.

బీపి 120/80 mm Hg కంటే తక్కువగా ఉంటే కనీసం ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి పరీక్షించండి.

మన లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేయడం ద్వారా, మందులు తీసుకోవడం ద్వారా బీపిని తగ్గించుకోవచ్చు.

మనకు గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్ చెబితే చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు ఎక్కువ బరువు, ఊబకాయంతో ఉన్నారు.

ఊబకాయం గుండెజబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, మధుమేహం, సహా అనేక ఆరోగ్య సమస్యల్ని తీసుకొస్తుంది.

45 సంవత్సరాల వయస్సు నుండి కనీసం ప్రతి 3 సంవత్సరాలకు ఓ సారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

ట్రీట్‌మెంట్ చేయని మధుమేహం గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి అనేక ప్రధాన సమస్యల్ని కలిగిస్తుంది.

పైన తెలిపిన వివరాలను ఆరోగ్య నిపుణున సూచనలు, పలు అధ్యాయనాల ప్రకారం అందించాము.

ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.