సోషల్ మీడియా దిగ్గజ మెసెంజర్ వాట్సాప్ తమ యూజర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వాట్సాప్ లో ఇప్పటివరకు ఉన్న ఫీచర్స్ లోని వినియోగదారులకు బాగా ఇబ్బంది కలిగిస్తోంది మీడియా షేరింగ్.
అవును వాట్సాప్ లో 100 ఎంబీకి మించి మీడియా ఫైల్స్ ను షేర్ చేసేందుకు వీలుండదు.
ఈ విషయంపై ఇప్పటికే యూజర్ల నుంచి చాలానే రిక్వెస్ట్‌లు వచ్చాయి. వాటన్నింటిపై దృష్టి సారించిన వాట్సాప్ దానిని అధిగమించేందుకు సరికొత్త ఫీచర్స్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
వాట్సాప్ యాప్ ద్వారా 2 జీబీ వరకు మీడియా ఫైల్స్ షేర్ చేసుకునేందుకు వీలుగా అప్డేట్ చేయనున్నట్లు సమాచారం.
ఆ ఫీచర్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 జీబీ వరకు మీడియాను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసుకోవచ్చు.
ఆ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు చెబుతున్నారు. అది యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని తెలుస్తోంది.
ఒకవేళ అది సక్సెస్ అయితే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
ఇన్నాళ్లు పెద్ద సైజ్ ఫైల్స్ ను సెండ్ చేసేందుకు యూజర్లు వేరే యాప్స్ ను ఆశ్రయించాల్సి వచ్చేది.
వాట్సాప్ షేరింగ్ సైజ్ పెంచిదే మెసేజింగ్ కు, షేరింగ్ కు ఒకే యాప్ సరిపోతుంది.
వాట్సాప్ తీసుకురానున్న ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.