యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్.
మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తాజాగా మరో ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏదైనా చాట్ లిస్ట్‌ను పర్మినెంట్‌గా హైడ్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ గతంలో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఏ క్రమంలో వాట్సాప్ చాట్‌ను దాచటానికి మనం సాధారణంగా archive ఫీచర్‌ను ఉపయోగిస్తాం.
అయితే.. కొత్త మెసేజ్ వస్తే archive చాట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తుంది. కానీ.. ఇప్పుడు ఈ ఫీచర్‌ను వాట్సాప్ అప్‌డేట్ చేసింది.
ఇప్పుడు కొత్త మెసేజ్ వచ్చినా archive చాట్ నోటిఫికేషన్ అలర్ట్ రాకుండా చాట్‌ను పర్మినెంట్‌గా హిడెన్ చేయవచ్చు.
మీ చాట్ స్ట్రీమ్ టాప్‌లో archive సెక్షన్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ సెక్షన్‌కు వెళ్లి.. మీ సీక్రెట్ చాట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
యూజర్లు చాట్‌ను అన్ archive చేయాలనుకుంటే.. ఆ చాట్‌ను లాంగ్ ప్రెస్ చేసి అన్ archive ఆఫ్షన్‌పై క్లిక్ చేయాలి.