నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సేవలకు అనుమతిస్తోంది.

ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల యాప్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. 

వాట్సాప్ కూడా ఇప్పటికే.. ఈ సేవలు అందిస్తున్నప్పటికీ యూజర్లను అంతగా ఆకర్షించకలేకపోతోంది. 

ఈ క్రమంలో పోటీని తట్టుకోవడానికి క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ముందుకొస్తోంది. 

కొద్దిరోజుల క్రితం ‘వాట్సాప్ పేమెంట్స్’ ద్వారా నగదు చెల్లింపులు చేసిన వారికి రూ.51 క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.  

దీనిపై వాట్సాప్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఈ ఆఫర్ ను బీటా యూజర్స్ ద్వారా పరీక్షించినట్లు సమాచారం. ఈ క్రమంలో మరో వార్త అందుతోంది. 

వాట్సాప్ ద్వారా యూపీఐ ట్రాన్సక్షన్స్ చేసిన వారికి ఆ సంస్థ రూ.105 క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తున్నది అని సమాచారం. 

ముగ్గురు వేర్వేరు కాంటాక్ట్స్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.35 చొప్పున క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది వాట్సప్. 

ఇలా మూడు సార్లు రూ.35 చొప్పున మొత్తం రూ.105 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.  

అయితే ఒకే యూజర్‌కు మూడు సార్లు డబ్బులు పంపిస్తే ఒకసారి మాత్రమే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.  

వేర్వేరు యూజర్లకు.. వేర్వేరు సందర్భాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. వాట్సప్ పేమెంట్స్ యూజర్ల ట్రాన్సాక్షన్ విజయవంతం అయిన తర్వాత రూ.35 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 

ఈ పీచర్ ఎక్కువ రోజులు అందుబాటులో ఉండకపోవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వాట్సాప్ పేమెంట్స్ ద్వారా ఎక్కువ మంది యూజర్స్ చెల్లింపులు చేసేలా ప్రోత్సహించేందుకే ఈ ఆఫర్ తీసుకొస్తుందని అంటున్నారు. 

పేమెంట్ సేవలను ప్రారంభించిన తొలి నాళ్లలో గూగుల్ పే కూడా స్క్రాచ్ కార్డుల రూపంలో క్యాష్బ్యాక్ అందించి పెద్ద సంఖ్యలో వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పేటీఎం, ఫోన్ పే.. సైతం ఇవే మార్గాలను అనుసరించాయి. 

వాట్సాప్ పేమెంట్స్ ఎలా చేయాలంటే.. 

1. ఇందుకు మొదటగా మీరు తెలుసువాల్సిన విషయం.. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన ఫోన్ నంబర్, మీ వాట్సాప్ అకౌంట్ ఫోన్ నంబర్ ఒకటే అయ్యుండాలి.

2. ఒకటే అయ్యుంటే.. వాట్సాప్ ఓపెన్ చేయగానే.. రైట్ సైడ్ మూడు చుక్కలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేయండి.

3. అందులో పేమెంట్స్ ఆప్షన్ ను ఎంచుకోండి.

4. దానిపై క్లిక్ చేస్తే సెండ్ పేమెంట్, యాడ్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.

5. వాటిలో యాడ్ న్యూ పేమెంట్ మెథడ్ పై క్లిక్ చేస్తే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ‘ఓకే’ చేస్తే మీకు బ్యాంకుల జాబితా కనిపిస్తుంది.

6. అందులో మీ ఖాతా ఉన్న బ్యాంక్ సెలెక్ట్ చేస్తే ఎస్సెమ్మెస్ ద్వారా వెరిఫికేషన్ చేయమని అడుగుతుంది. దాని ఒకే చేసి మీ బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలి.

7. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక మీ అకౌంట్.. వాట్సాప్ పేమెంట్స్ కు లింక్ చేయబడుతుంది.

8. లింక్ అయ్యాక..  సెండ్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి.

9. మీరు పంపాలన్న వారి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందుకోసం అవతలి వారు కూడా వాట్సాప్ పేమెంట్స్ కు అకౌంట్ లింక్ చేసుకొని ఉండాలి.

10. ఇప్పుడు ఎంత అమౌంట్ పంపాలనుకున్నారో.. ఎంటర్ చేసి.. యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.

మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్న మొత్తం మీ అకౌంట్ నుంచి డెబిట్ అయి వారి అకౌంట్‌లోకి వెళ్తుంది. 

మీకు రూ.35 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇలా ముగ్గురికి డబ్బులు పంపి మీరు మొత్తం రూ.105 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. 

ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.