ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఎంతో గొప్ప ఆదరణ ఉంది.

యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంటుంది.

ప్రతి నెల కనీసం ఒక్క అప్ డేట్ అయినా ఉండేలా వాట్సాప్ జాగ్రత్త పడుతుంది.

ఆండ్రాయిడ్ యూజర్లు- ఐవోఎస్ యూజర్లకు విడిగా ఫీచర్స్ ని తీసుకొస్తూ ఉంటారు.

ఆండ్రాయిడ్ యూజర్లకే ఎక్కువ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తారంటూ ఐవోఎస్ యూజర్ల కామెంట్ చేస్తుంటారు.

అయితే గత కొన్ని నెలలుగా మాత్రం ఆండ్రాయిడ్ కంటే.. ఐవోఎస్ యూజర్ల కోసమే ఎక్కువ అప్ డేట్స్ తెస్తున్నారు.

ఇప్పుడు కూడా ఐవోఎస్ వినియోగదారుల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ ని తీసుకురానుంది.

ఇప్పుడు వాట్సాప్ తెచ్చిన కొత్త ఫీచర్.. టెలిగ్రామ్ యూజర్లకు బాగా పరిచయం ఉంటుంది.

ఎందుకంటే ఇప్పటికే టెలిగ్రామ్ లో ఇలాంటి ఫీచర్ ఒకటి అందుబాటులో ఉంది.

అదే వీడియో మెసేజ్ సేండ్ చేసే ఫీచర్ అనమాట.

మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని 60 సెకెండ్స్ వీడియో రూపంలో రికార్డ్‌ చేసి మెసేజ్ చేయచ్చు.

ఈ సరికొత్త ఫీచర్ లో కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఎన్ క్రిప్షన్ ఉండటం వల్ల మీ చాట్ కి మరింత భద్రత ఉంటుంది.

ఒకేసారి 4 డివైజ్ లకి కనెక్ట్ చేయడం, వెబ్‌ వాట్సాప్‌ నుంచి ఆడియో- వీడియో కాల్స్ వంటి ఫీచర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.