మనవాళ్ళు తరచుగా అనే మాట. ఏది పడితే అది తినకు. వేడి చేస్తుంది అని అంటారు. కొన్ని ఆహార పదార్థాలు తింటే వేడి చేస్తుంది.

శరీరంలో యాసిడ్లు ఎక్కువైనప్పుడు కలిగే సమస్యని వేడి చేయడం అంటారు.

వేడి పెరిగినప్పుడు కడుపులో, గొంతులో మంట, కళ్ళు మండడం, ముఖం నుండి ఆవిర్లు రావడం,  అరికాళ్ళు, అరచేతులలు మండినట్టు అనిపించడం, మల, మూత్రంలో మంట రావడం, శరీరం మొత్తం మండుతున్నట్టు ఉండడం వంటి లక్షణాలు కనబడతాయి.

శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

వేడి ఎక్కువ అవ్వడం వల్ల జీవకణాలు దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రక్తహీనత, రక్తనాళాల వ్యాధులు, వీర్యంలో జీవకణాలు నశించడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

వేడి ఎక్కువైతే జీర్ణాశయం, కాలేయం, మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశం ఉంది.

అధిక వేడి వల్ల కండరాల్లో నొప్పి, కండరాలు వంకర పోవడం, తిమ్మిరెక్కడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటికి చలువ చేసే పదార్థాలను తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి.

ఒంట్లో వేడి ఎక్కువ ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి, మసాలా పదార్థాలు, నూనెలో వేయించిన ఆహరం, పుల్లని పదార్థాలు తినకూడదు.

ఉదయం టిఫిన్ లో వాడే కారం పొడి, అల్లం చట్నీ, పల్లీ చట్నీ తినడం వల్ల శరీరం వేడి చేస్తుంది.

కాబట్టి వేడి ఎక్కువ ఉన్నవాళ్లు కారంగా ఉన్నవి తినకుండా.. సాధ్యమైనంత వరకూ సాత్వికంగా ఉండే ఆహారం తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ సమాచారం కేవలం అంతర్జాలంలో సేకరించింది మాత్రమే. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.