గుడికి వెళ్లినపుడు మనం టెంకాయ కొట్టడం పరిపాటి.
గుళ్లో దేవుడికి టెంకాయలను కొట్టి వాటిని నైవేద్యంగా అర్పిస్తుంటాము
టెంకాయలో ఉండే నీటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
అందుకే టెంకాయలను దేవుడికి నైవేద్యంగా పెడతారు.
అంతేకాదు! మనలోని అహం, ఈర్ష్య, అసూయ, కోపం తదితర గుణాలు పోవాలని కూడ
ా దేవుడికి టెంకాయ కొడతారు.
టెంకాయలకు ఉండే మూడు కళ్లను శివుడి కళ్లుగా భావిస్తారు.
అందుకనే వాటిని కొట్టేముందు దాన్ని బాగా కడుతారు.
ఇక టెంకాయను పెట్టి కొట్టే రాయి ఆగ్నేయ ముఖంగా ఉండాలంటారు.
కొంతమంది టెంకాయ కొట్టాక వాటిని విడదీయకుండా అలాగే పెట్టేస్తారు.
కానీ, అలా చేయకూడదు. వెంటనే టెంకాయ విడదీసి అందులో ఉన్న నీటిని వేరే
పాత్రలో పోయాలి.
ఆ రెండు చెక్కలపై కుంకుమ రాసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి.
కొన్ని సార్లు టెంకాయ కొట్టినపుడు కుళ్లిపోయి వస్తుంటుంది.
ఈ నేపథ్యంలో తమకు అశుభం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు.
కానీ, అది వాస్తవం కాదు. మూఢనమ్మకమే.
ఒక వేళ టెంకాయ కుళ్లిపోయి వస్తే.. మళ్లీ స్నానం చేసి వచ్చి
మళ్లీ ఇంకో టెంకాయ కొట్టొచ్చు.
ఒక వేళ టెంకాయ కుళ్లిపోయి వస్తే.. మళ్లీ స్నానం చేసి వచ్చి
మళ్లీ ఇంకో టెంకాయ కొట్టొచ్చు.
వాహనాలకు పూజ చేసే సమయంలో కుళ్లిన టెంకాయ వచ్చినా ఇదే నియమం వర్తిస్తుంది.
వాహనాన్ని మళ్లీ శుభ్రంగా కడిగి, భక్తులు తాము కూడా స్నానం చేసి మళ్లీ ఓ కొత
్త టెంకాయను కొడితే సరిపోతుంది.