బట్టలైనా, టూత్ బ్రష్ లైనా, ఇంకేవైనా గానీ కొన్ని రోజుల వరకే వాడాలి.
అవి పూర్తిగా పాడయ్యే వరకూ వినియోగిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల లైఫ్ టైం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పైగా దంతాలు కూడా శుభ్రంగా ఉంటాయి.
అయితే ఒకే బ్రష్ ను ఎక్కువ రోజులు యూజ్ చేస్తే బ్రష్ మీద బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీని వల్ల దంతక్షయం ఏర
్పడుతుంది.
ప్రతీ ఒక్కరూ తమ టూత్ బ్రష్ లను ప్రతీ 3 నెలలకొకసారి ఖచ్చితంగా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే 3 నెలల కంటే ముందే బ్రష్ ను మారుస్తూ ఉండాలి.
మాయిశ్చరైజ్డ్ టూత్ బ్రష్ లను క్లోజ్డ్ కంటైనర్ లో పెడితే వాటిపై సూక్ష్మజీవులు చేరతాయి.
బ్రష్ లను ఉపయోగించిన తర్వాత బాగా కడిగి.. నిలువుగా నిలబెట్టాలి. ఇలా పెట్టడం వల్ల తొందరగా ఆరుతోంది. తేమ కూ
డా పోతుంది.
బ్రష్ బ్రిజిల్స్ పాడైతే దంతాలు పూర్తిగా శుభ్రం అవ్వవు. పాడైన బ్రిజిల్స్ బ్రష్ తో పళ్ళు తోమడం వల్ల పంటి న
ొప్పి వచ్చే అవకాశం ఉంది.
జ్వరం లేదా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత టూత్ బ్రష్ లను మార్చాలి.
ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు పళ్ళు తోముకున్నప్పుడు బ్యాక్టీరియా బ్రష్ పై ఎక్కువగా ఉంటుంది.
దీని వల్ల మళ్ళీ అనారోగ్య సమస్య తలెత్తచ్చు. అందుకే బ్రష్ ను మార్చాలి.
బ్రిజిల్స్ హార్డ్ గా ఉండే బ్రష్ లను యాజ్ చేయడం వల్ల దంతాలు దెబ్బ తింటాయి.
అందుకే సాఫ్ట్ బ్రష్ లను యూజ్ చేస్తే మంచిది. సాఫ్ట్ బ్రిజిల్స్ దంతాలను దెబ
్బ తినకుండా చూస్తాయి.