ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని మనుషులంటూ ఎవరూ లేరు. చిన్నోళ్లో, పెద్దోళ్ళో.. చిన్నదో, పెద్దదో చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది కామన్.

స్మార్ట్ ఫోన్ వల్ల ప్రయోజనాలు ఎంతలా ఉన్నాయో, దుష్పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.

పెద్ద వాళ్ళే కాదు, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఈ స్మార్ట్ ఫోన్లకి బానిసైపోతున్నారు. 

అయితే దీని వల్ల చిన్నతనం నుంచే పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

నిద్ర పోకుండా ఫోన్ వాడడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.

స్నానం చేస్తుంటే ఫోన్ కూడా చూడాలని కాబోలు.. కొంతమంది ఫోన్ ని బాత్రూమ్ లోకి తీసుకెళ్తారు.

అలా తీసుకెళ్లడం వల్ల బాత్రూమ్ లో ఉండే సూక్ష్మక్రిములు, హాని చేసే క్రిములు ఫోన్ మీద వాలతాయి.

అవి బాత్రూమ్ లోంచి బెడ్ రూమ్ లోకి జర్నీ చేసి తినే అన్నం ద్వారా నోట్లోకి, వయా కడుపులోకి వెళ్లి అతలాకుతలం చేసి పడేస్తాయి. 

ఫోన్ లో మాట్లాడేటప్పుడు చెంపను ఫోన్ కి ఆనిస్తారు. అప్పుడు ఫోన్ మీద ఉండే క్రిములు చర్మంపై చేరి మొటిమలు, దద్దుర్లు, అలర్జీ, నల్లని మచ్చలకు కారణమవుతాయి.   

ఫేస్ క్రీమ్, మేకప్, చెమట వంటివి ఫోన్ కి అంటుకుంటాయి. వీటి వల్ల కూడా అనారోగ్యమే.

స్మార్ట్ ఫోన్ ని బయటకు తీసుకెళ్లినప్పుడు వీలైతే శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటే మంచిది. 

40 శాతం ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ తో గానీ, మిగతా మొబైల్ లిక్విడ్ క్లీనర్లతో గానీ శుభ్రపరచుకోవాలి.

ఇవన్నీ కాదు గానీ ఇంకో మాట చెప్పు అంటారా? అయితే హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ ని వాడడం మంచిది.

అవి కూడా ఎక్కువ వాడితే చెవి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.   

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై నికెల్, కోబాల్ట్, క్రోమియం వంటి హానికర పదార్థాలు ఉండడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి.