మనకు రోగ నిరోధక శక్తిని పెంచే  పదార్ధాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో వెల్లుల్లి  ఒకటి.  ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి .

మన వంటిళ్ళలో తప్పని సరిగా ఉండే వస్తువుల్లో ఈ వెల్లుల్లి ఒకటి. రుచి తో పాటు వెల్లుల్లికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

మనం తినే ఆహారంలో వెల్లుల్లి  తీసుకోవడం మంచిదే. అయితే ఏదైనా అతిగా తీసుకుంటే అనర్ధమే.

వెల్లుల్లి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి.. మంచి  కొలెస్ట్రాల్  పెరిగేలా ప్రోత్సహించి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.

డయాబెటీస్, డిప్రెషన్, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ ని గణనీయంగా తగ్గిస్తుంది.

శరీరం లో ఉన్న అన్ని అవయవాలూ సరిగ్గా పని చేసేలా చేసి జీవిత కాలాన్ని పెంచుతుంది.

అయితే ఏదైన అతిగా తీసుకున్న అనర్ధాలు వస్తాయి. వెల్లులి విషయంలో కూడా అంతే.

 వెల్లుల్లి ఎక్కువ తీసుకుంటే మాత్రం మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఆరోగ్య నిపుణలు అభిప్రాయం.

వెల్లుల్లి ఎక్కువగా తింటే విరేచనాలు, వాంతులు వంటివి వస్తాయి.

పరిమితికి మించి వెల్లులి కడుపులో నొప్పి వంటివి తలెత్తుతాయి.

మోతాదుకు మించి వెల్లుల్లి తింటే కాలేయం పనితీరు దెబ్బతింటుంది.

వెల్లుల్లి ఎక్కువ తీసుకోవడం వల్ల 'Low BP', తల తిరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

బాలింతలు, గర్భిణులు, చిన్నారులు పచ్చి వెల్లుల్లి తినకపోవడం మంచిది.

 స్టమక్ అల్సర్స్ ఉన్న వారు పరగడుపున వెల్లుల్లి తీసుకోకూడదు.

ఏది ఏమైనప్పటికి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయంలో డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది.