సాధారణంగా ఒక మనిషి రోజుకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటారు.
నీళ్లు ఎక్కువ తాగే వారు పది కంటే ఎక్కువ సార్లు వెళ్తారు వాతావరణం చల్లగా ఉన్నా ఎక్కువ సార్లు వెళ్తారు.
అయితే కొంతమంది తరచుగా మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. రాత్రి పూట కూడా అదే పనిగా వెళ్తుండడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
ఈ సమస్య దీర్ఘకాలంగా ఉంటే కనుక ఈ సమస్యలు ఉన్నాయేమో నిర్ధారించుకోవాలి.
తరచూ మూత్ర విసర్జన చేస్తుంటే టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ కి కారణమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్ కారణంగా రక్తంలో చక్కెరలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఎక్కువ గ్లూకోజ్ ని ఫిల్టర్ చేసేలా కిడ్నీలపై ఒత్తిడి తీసుకొస్తాయి. అది అతి మూత్ర విసర్జనకు దారి తీస్తుంది.
దీన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటే గనుక వైద్యుడ్ని సంప్రదించడం మంచిది.
ఓవర్ యాక్టివ్ బ్లేడర్ కారణంగా మూత్ర విసర్జన చేయాలన్న కోరిక అతిగా ఉంటుంది. దీని వల్ల తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు.
ఈ సమస్య ఉంటే గనుక వైద్యుడ్ని సంప్రదించి చికిత్స చేయించుకోవడం మంచిది.
మూత్రనాళానికి సంబంధించి ఇన్ఫెక్షన్ ను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా సాధారణంగా వెళ్లే దాని కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది.
కొంతమందికి యూరిన్ లో మంట రావడం, రక్తస్రావం కలగడం జరుగుతుంటాయి. సడన్ గా యూరిన్ రావడం, పొత్తి కడుపు నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడ్ని సంప్రదించడం మంచిది.
కిడ్నీలో రాళ్లు ఉంటే తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లే పరిస్థితి వస్తుంది. మూత్రాశయానికి దగ్గరలో ఉండే రాళ్ళ కారణంగా తరచూ మూత్ర విసర్జనకు దారి తీస్తుంది.
పురుషులు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటే గనుక ప్రోస్టేట్ సమస్యకు సంకేతం. ప్రోస్టేట్ విస్తరించడం, ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ ఇన్ఫ్లమేషన్ కారణంగా పదే పదే మూత్ర విసర్జన అవుతుంది.
స్త్రీలలో అయితే యుటిఐ, ఓఏబీ, మూత్రాశయ ఇన్ఫెక్షన్ కారణంగా తరచూ మూత్ర విసర్జన సమస్య వస్తుంది.
గర్భధారణ, ఫైబ్రాయిడ్లు, మోనోపాజ్, అండాశయ క్యాన్సర్, ఈస్ట్రోజన్ తక్కువ విడుదల అవ్వడం వంటివి జరిగితే తరచూ మూత్ర విసర్జన అవుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.