మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కేవలం ఆహారం విషయంలోనూ కాదు.. వ్యాయామం విషయంలోనూ శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో పని చేయకుండా ఉండిపోవటం ఎంత తప్పో.. అతిగా పని చేయటం వ్యాయమం చేయటం కూడా తప్పే

ఏది చేసినా ఓ పద్ధతి ప్రకారం.. కడుపులో బిడ్డకు ఇబ్బంది కలగకుండా చేయాలి.

నెలలు గడుస్తున్న కొద్ది వ్యాయామంలో మార్పు చేస్తూ ఉండాలి. 

 నడకను తప్పని సరిగా కొనసాగించాలి.

నడక వల్ల గర్భిణులకు ఎంతో మేలు జరుగుతుంది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం గర్భిణులు ప్రతి వారం 150 నిమిషాలు నడవాలి.

తద్వారా పిల్లలు బరువు తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది.

ముందుగా డెలివరీ అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. గర్భస్రావం వంటి ప్రమాదాలు తగ్గుతాయి.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ప్రకారం.. గర్భధారణ సమయంలో నడవడం వల్ల సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశాలు తగ్గుతాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మధుమేహం,  ప్రీక్లాంప్సియా, ముందస్తు ప్రసవ ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.