మారుతున్న ఆహారపు అలవాట్లతో లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు జనాలు.

ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి కారణంగా పలు రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు నేటి మానవులు.

మరీ ముఖ్యంగా ప్రస్తుత మానవుడిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు.

అధిక బరువును తగ్గించుకోవడానికి మానవుడి చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు.

అయితే చాలా మందిలో బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారా? షుగర్ కంట్రోల్  అవుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రౌన్ రైస్ తినడం ద్వారా బరువు తగ్గుతారు అని సమాధానం ఇస్తున్నారు నిపుణులు. దానికి బలమైన కారణాలు కూడా వెల్లడిస్తున్నారు.

బ్రౌన్ రైస్ మన శరీరంలో విసెరల్(బెల్లీ ఫ్యాట్) కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.

ఇక ఈ రైస్ లో పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, బి విటమిన్లతో పాటుగా మాంగనీస్ సెలీనియం లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

దాంతో మీ శరీరానికి కావాల్సినంత రోగనిరోధక శక్తి లభిస్తుంది.

వాటితో పాటుగా బ్రౌన్ రైస్ ను తినడం మూలంగా మీ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

బ్రౌన్ రైస్ అంత తొందరగా జీర్ణం చెందదు. దాంతో మీ షుగర లెవల్స్ అమాంతం పెరకుండా కంట్రోల్ లో ఉండేందుకు ఈ రైస్ పనిచేస్తుంది.

నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్ల, నిపుణుల సలహాలు తీసుకోండి.