మాములుగా కొత్త బట్టలు వేసుకోవడం అంటే అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు.

కానీ, నిపుణులు మాత్రం కొత్త బట్టలను ఉతక్కుండానే వేసుకోవద్దని చెబుతున్నారు

అలా వేసుకోవడం వల్ల లేని పోని చర్మ సమస్యల పాలవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కొత్తబట్టలు ఉతక్కుండానే వేసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి?

అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

చాలా మంది కొత్త బట్టలు కొనుకున్నామన్న ఆనందంలో షాపులోంచి తెచ్చుకున్న వెంటనే ధరిస్తుంటారు.

కొత్త బట్టలను ఉతక్కుండా అలాగే వేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. 

విషయం ఏంటంటే..? కొత్తబట్టల్లో హానికరమైన రసాయనాలు ఉంటాయి. అలాగే వేసుకోవడం వల్ల చర్మసంబంధిత సమస్యలు వస్తాయట.

 కొత్త బట్టలను అలాగే వేసుకోవడం వల్ల చివరికి కాంటాక్ట్ డెర్మాటాటిస్ అనే వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా చర్మం ఎర్రగా మారే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు. 

ఇక నుంచైన కొత్త బట్టలు కొనుగోలు చేసిన తర్వాత ఉతికి వేసుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.