ఉప అంటే దగ్గరగా.. వాసం అంటే నివసించడం.. ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం అని అర్థం.

ఉపవాసం అంటే.. భగవంతునికి దగ్గరగా నివసించడం అని కూడా అర్థం వస్తుంది.

మతాల వారీగా ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఓ మతం వారు వారంలో కొన్ని రోజులు లేదా ఓ రోజు ఉపవాసం ఉంటారు.

మరో మతం వారు ప్రత్యేకమైన పండుగల సందర్భంగా ఉపవాసం ఉంటారు.

ఉపవాసాన్ని దేవుడికి ఎంతో భక్తితో చేసే సేవ అనుకుంటారు అన్ని మతాల వాళ్లు.

ఉపవాసాన్ని ఒక్కోరు ఒక్కోలా చేస్తారు. ఆహారం తీసుకునే విషయంలోనూ తేడాలుంటాయి.

ఇక, ఉపవాసం వల్ల చాలా లాభాలు ఉంటాయి.

శరీరానికి మాత్రమే కాదు.. మనసుకు కూడా చాలా లాభాలు ఉంటాయి. అవేంటంటే..

 ఉపవాసం చేయటం కారణంగా ఆరోగ్యం మెరుగు పడుతుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

అలానే హానికరమైన రసాయనాలు మన ఒంట్లో నుంచి తొలిగిపోతాయి.

ఉపవాసం చేయటం వల్ల అవయవాల పని తీరు మెరుగుపడుతుంది.

మూత్రపిండాలలోని విష పదార్ధాలు, రాళ్లు బయటకు వెళ్లిపోతాయి.

ఊపిరితిత్తులలోని నంజు, నీరు బయటకు వెళ్లిపోతాయి. ఆయాసం తగ్గుతుంది. శ్వాసక్రియ మెరుగుపడుతుంది.

గుండెచుట్టు, లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి హృదయ స్పందన బాగుంటుంది.

ఉపవాసం వల్ల కాలేయానికి విశ్రాంతి దొరుకుతుంది. దానిలోని మాలిన్యం తొలగిపోయి జీర్ణక్రియ వృద్ది చెందుతుంది.

ఇంతేకాదు.. ఉపవాసం చేయటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

నోట్: పైన టిప్స్ పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుడిని కూడా సంప్రదించండి.