మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది.

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

ఈసారి ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసార హక్కులను రిలయన్స్ సంస్థకి చెందిన వాయికామ్ దక్కించుకుంది.

వాళ్లు ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్ ని ఫ్రీగా చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ స్ట్రీమింగ్ ఫ్రీగా ఇస్తున్నా కుడా.. ఆ మ్యాచులు చూడాలంటే మీకు కచ్చితంగా డేటా కావాలిగా?

అందుకే జియో వాళ్లు ఐపీఎల్ సీజన్ సందర్భంగా కొన్ని క్రికెట్ బొనాంజా రీఛార్జ్ ప్లాన్స్ ని తీసుకొచ్చారు.

క్రికెట్ అభిమానుల కోసం రూ.999, రూ.399, రూ.219 రీఛార్జ్‌ ప్లాన్స్ ని పరిచయం చేశారు.

ఈ రీఛార్జుల ద్వారా రోజుకు 3 జీబీ డైలీ లిమిట్ తో డేటా వాడుకోవచ్చు.

రూ.999 ప్లాన్: 84 రోజుల పాటు రోజుకి 3 జీబీ డేటా లభిస్తుంది. రూ.241 విలువైన డేటా ఓచర్ లభిస్తుంది.

రూ.399 ప్లాన్: ఈ టారిఫ్ తో 28 డేస్‌ వ్యాలిడిటీ.. రూ.61 విలువైన డేటా వోచర్ లభిస్తుంది.

రూ.219 ప్లాన్: 14 రోజుల వ్యాలిడిటీ.. రూ.25 వోచర్ లభిస్తుంది.

అదనపు డేటా కోసం ఆడాన్‌ టారిఫ్లు కూడా తీసుకొచ్చారు.

రూ.222 ప్లాన్: ఇది బేస్ ప్లాన్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 50GB డేటా లభిస్తుంది.

రూ.444 ప్లాన్: 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో 100 GB డేటా లభిస్తుంది.

రూ.667 ప్లాన్: 90 డేస్ వ్యాలిడిటీ లభిస్తుంది. 150 GB డేటా లభిస్తుంది.